Neegu naagu sarivaalai nimde valabu

నీకు నాకు సరివాలై నిండె వలపు
Language

(॥పల్లవి॥)
నీకు నాకు సరివాలై నిండె వలపు
కైకొందము రావయ్యా కందువైన వలపు

(॥॥)
యెదురుచూడఁ గానే ఇంటీకి విచ్చేసితివి
పదనుదప్పకుండాను పండె వలపు
వదలుఁ బయ్యెదలోనివట్రువగుబ్బ లంటేవు
యెదుటనే కొటారుకు నెక్కెనిదె వలపు

(॥॥)
అట్టె తలవంచఁ గానే ఆసమాట లాడితివి
నెట్టుకొన్నకణఁ జాల నిండె వలపు
తెట్టఁ దెరువున మోవితేనెలు చవిచూపేవు
గుట్టుతోడుత నామనిగుంపులాయ వలపు

(॥॥)
కవకవనవ్వఁగానే కాఁగిలించుకొంటివి
చివురులో చేఁగలై చిక్కె వలపు
యివల శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
జవళిసోబనముల జంటలాయ వలపు

(||pallavi||)
nīgu nāgu sarivālai niṁḍĕ valabu
kaigŏṁdamu rāvayyā kaṁduvaina valabu

(||||)
yĕdurusūḍam̐ gāne iṁṭīgi vichchesidivi
padanudappaguṁḍānu paṁḍĕ valabu
vadalum̐ bayyĕdalonivaṭruvagubba laṁṭevu
yĕduḍane kŏḍārugu nĕkkĕnidĕ valabu

(||||)
aṭṭĕ talavaṁcham̐ gāne āsamāḍa lāḍidivi
nĕṭṭugŏnnagaṇam̐ jāla niṁḍĕ valabu
tĕṭṭam̐ dĕruvuna movidenĕlu savisūbevu
guṭṭudoḍuda nāmaniguṁpulāya valabu

(||||)
kavagavanavvam̐gāne kām̐giliṁchugŏṁṭivi
sivurulo sem̐galai sikkĕ valabu
yivala śhrīveṁkaḍeśha inniḍā nannelidivi
javaḽisobanamula jaṁṭalāya valabu