Neegu meludi seliya ninu jaraya dennamdunu

నీకు మేలుది చెలియ నిను జరయ దెన్నఁడును
Language

(॥పల్లవి॥)
నీకు మేలుది చెలియ నిను జరయ దెన్నఁడును
చేకొనుము విన్నపము సేసితిమి రతుల

(॥నీకు॥)
పంతంబులేమిటికి పతితోడ సతులకును
సంతసము రేఁచుసరసములుఁడఁగా
వింతవిరసములేల వెంగెంబు లేమిటికి
మంతనపురతులలో మచ్చికలె నేలు

(॥నీకు॥)
పొలయలుక లేమిటికి బొమ్మజంకెనలతో
తిలకింపఁదగిన తరితీపు లమరు
పెలుచుగర్వములేల బిగియుచుఁ బెనఁగనేల
అలమి మెయిసోఁకు లడియాసలే తగులు

(॥నీకు॥)
మొనసి వొల్లములేల మొగమెదుటనే వుండి
తనిసి సిగ్గులతోడ దగులవలయు
యెనసితివి శ్రీవేంకటేశ యాజవరాలి
వినయములతో బెనఁగువేడుకలే సతము

(||pallavi||)
nīgu meludi sĕliya ninu jaraya dĕnnam̐ḍunu
segŏnumu vinnabamu sesidimi radula

(||nīgu||)
paṁtaṁbulemiḍigi padidoḍa sadulagunu
saṁtasamu rem̐susarasamulum̐ḍam̐gā
viṁtavirasamulela vĕṁgĕṁbu lemiḍigi
maṁtanaburadulalo machchigalĕ nelu

(||nīgu||)
pŏlayaluga lemiḍigi bŏmmajaṁkĕnalado
tilagiṁpam̐dagina taridību lamaru
pĕlusugarvamulela bigiyusum̐ bĕnam̐ganela
alami mĕyisom̐ku laḍiyāsale tagulu

(||nīgu||)
mŏnasi vŏllamulela mŏgamĕduḍane vuṁḍi
tanisi sigguladoḍa dagulavalayu
yĕnasidivi śhrīveṁkaḍeśha yājavarāli
vinayamulado bĕnam̐guveḍugale sadamu