Neegosame ne jeevimchunadi

నీకోసమె నే జీవించునది
Year
Language

పల్లవి:

నీకోసమె నే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో..
నీకోసమె నే జీవించునది

వెన్నెల కూడా చీకటి యైనా
మనసున వెలుగే లేక పోయినా..........
నీకోసమె నే జీవించునది

చరణం 1:

విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా ...

నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో...నా మనస్సులో ...
నీరూపమె నే ధ్యానించునది

చరణం 2:

హృదయము నీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ
నీకోసమె నే జీవించునది...

చరణం 3:

మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా ఇక నా దానవెగా

నీ రూపమెనే ధ్యానించునది... ఈ విరహాములో..ఈ నిరాశలో
... నీకోసమె నే జీవించునది

pallavi:

nīgosamĕ ne jīviṁchunadi
ī virahamulo ī nirāśhalo..
nīgosamĕ ne jīviṁchunadi

vĕnnĕla kūḍā sīgaḍi yainā
manasuna vĕluge lega poyinā..........
nīgosamĕ ne jīviṁchunadi

saraṇaṁ 1:

virahamu kūḍā sukhame kādā
niradamu siṁtana madhuramu kādā
virahamu kūḍā sukhame kādā
niradamu siṁtana madhuramu kādā
viyoga veḽala virise premala viluvanu kanalevā ...

nī rūbamĕ ne dhyāniṁchunadi
nā hṛdayamulo...nā manassulo ...
nīrūbamĕ ne dhyāniṁchunadi

saraṇaṁ 2:

hṛdayamu nīdo vĕḍaliboyinā madilo āśhalu māsiboyinā
mana premalane mari mari talasi prāṇamu nilubugŏnī
nīgosamĕ ne jīviṁchunadi...

saraṇaṁ 3:

mĕlaguvanainā kalalonainā kŏludunu ninne praṇayadevigā
logamulanni egamĕ ayinā iga nā dānavĕgā

nī rūbamĕne dhyāniṁchunadi... ī virahāmulo..ī nirāśhalo
... nīgosamĕ ne jīviṁchunadi