నీకొలఁది వారమా నేమెల్లాను
(॥పల్లవి॥)
నీకొలఁది వారమా నేమెల్లాను
పైకొని మమ్ముఁజూచి బతుకఁగఁ గదవే
(॥నీకొ॥)
నలపే గుఱిగాక వనితకుఁ బతికిని
సొలసి సొలసి యేమి జోలిదవ్వేవే
పిలుపే గుఱిగాక ప్రియముగలయందుకు
బలవంతములేల పచారించేవే
(॥నీకొ॥)
పాయమే గురికాక బగివాయనివారికి
చాయలా సన్నలా నేమిసాదించేవే
కాయమే గుఱిగాక కడలేని రతులకు
నాయములేల గడించి నవ్వు నవ్వేవే
(॥నీకొ॥)
వేడుకే గురిగాక వెలలేని పొందులకు
ఆడా నీడాఁ గూడి యెంత అలయించేవే
పాడితో శ్రీవేంకటాద్రిపతి నన్ను నిదె యేలె
జోడుగూడి నీవేల చొప్పులెత్తేవే
(||pallavi||)
nīgŏlam̐di vāramā nemĕllānu
paigŏni mammum̐jūsi badugam̐gam̐ gadave
(||nīgŏ||)
nalabe guṟigāga vanidagum̐ badigini
sŏlasi sŏlasi yemi jolidavveve
pilube guṟigāga priyamugalayaṁdugu
balavaṁtamulela pasāriṁcheve
(||nīgŏ||)
pāyame gurigāga bagivāyanivārigi
sāyalā sannalā nemisādiṁcheve
kāyame guṟigāga kaḍaleni radulagu
nāyamulela gaḍiṁchi navvu navveve
(||nīgŏ||)
veḍuge gurigāga vĕlaleni pŏṁdulagu
āḍā nīḍām̐ gūḍi yĕṁta alayiṁcheve
pāḍido śhrīveṁkaḍādribadi nannu nidĕ yelĕ
joḍugūḍi nīvela sŏppulĕtteve