నీకివి ప్రియములు నే నెఱుఁగుదును
(॥పల్లవి॥)
నీకివి ప్రియములు నే నెఱుఁగుదును
జోకలాయ మెచ్చుము సతినయ్యా
(॥నీకి॥)
పొలపుఁజూపులలో బొమ్మలజంకెలు
సళుపుఁబ్రియములతో సాదింపులు
పలుసరసములలో పంతపుసణఁగులు
చెలి నెరపీ నదె చేకొనవయ్యా
(॥నీకి॥)
మక్కువ సొందులలో మందె మేళములు
మొక్కులలో గోరిమొన వాండ్లు
చొక్కుమాటలలో సొలపుల కొసరులు
మిక్కిలి జరపీ మెఇకొనవయ్యా
(॥నీకి॥)
తఱితీపులలో తమకపుటాసలు
చిఱునవ్వులలో సిగ్గులును
నెఱితో శ్రీవేంకటనిలయ నిన్నెనసీ
మఱియు నాపె నేనుమన్నించవయ్యా
(||pallavi||)
nīgivi priyamulu ne nĕṟum̐gudunu
jogalāya mĕchchumu sadinayyā
(||nīgi||)
pŏlabum̐jūbulalo bŏmmalajaṁkĕlu
saḽubum̐briyamulado sādiṁpulu
palusarasamulalo paṁtabusaṇam̐gulu
sĕli nĕrabī nadĕ segŏnavayyā
(||nīgi||)
makkuva sŏṁdulalo maṁdĕ meḽamulu
mŏkkulalo gorimŏna vāṁḍlu
sŏkkumāḍalalo sŏlabula kŏsarulu
mikkili jarabī mĕigŏnavayyā
(||nīgi||)
taṟidībulalo tamagabuḍāsalu
siṟunavvulalo siggulunu
nĕṟido śhrīveṁkaḍanilaya ninnĕnasī
maṟiyu nābĕ nenumanniṁchavayyā