నీకెంత ఇతవైనదో నే నెఱఁగను
(॥పల్లవి॥)
నీకెంత ఇతవైనదో నే నెఱఁగను
కాకు సేసి నవ్వేరు కాంతలెల్లా మిమ్మును
(॥నీకెం॥)
పంతములకే వచ్చీని పరాకుచేసినాఁ బోదు
వంతులకే పెనఁగీని వనిత నీతో
యెంత చనవిచ్చితివో ఇందరిలో నీపెను
వింత లివి గనుఁగొని వెరగయ్యీ నాకు
(॥నీకెం॥)
వాడికనవ్వులు నవ్వీ వదన్నా మానదు
యీడువట్టు కొనవచ్చీ నింతి నీతోను
యేడ బాసలిచ్చితివో యీకె నింతసేసేనని
చూడఁజూడ నింతలోనే సోద్యమయ్యీ నాకు
(॥నీకెం॥)
చలములకే పైకొనీ చాలునన్నా విడువదు
బలుములే చూపీని భామ నీతోను
యెలమి శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి
అలరి యాపెసుద్దుల కరుదయ్యీ నాకు
(||pallavi||)
nīgĕṁta idavainado ne nĕṟam̐ganu
kāgu sesi navveru kāṁtalĕllā mimmunu
(||nīgĕṁ||)
paṁtamulage vachchīni parāgusesinām̐ bodu
vaṁtulage pĕnam̐gīni vanida nīdo
yĕṁta sanavichchidivo iṁdarilo nībĕnu
viṁta livi ganum̐gŏni vĕragayyī nāgu
(||nīgĕṁ||)
vāḍiganavvulu navvī vadannā mānadu
yīḍuvaṭṭu kŏnavachchī niṁti nīdonu
yeḍa bāsalichchidivo yīgĕ niṁtasesenani
sūḍam̐jūḍa niṁtalone sodyamayyī nāgu
(||nīgĕṁ||)
salamulage paigŏnī sālunannā viḍuvadu
balumule sūbīni bhāma nīdonu
yĕlami śhrīveṁkaḍeśha yiṁtalo nannelidivi
alari yābĕsuddula karudayyī nāgu