నీకేమి యిందరిలో నేనే రట్టైతిఁ గాక
(॥పల్లవి॥)
నీకేమి యిందరిలో నేనే రట్టైతిఁ గాక
చేకొని మగవాఁ డేమిసేసినాఁ జెల్లును
(॥నీకే॥)
వెగటుగా నేను నీవెంటవెంటఁదిరుగఁగా
నగుఁబాటులాయఁగా నా వలపు
నిగిడి కట్టు గాచుక నీవాకిట నుండఁగాను
నగరు వుట్టెఁగా నేఁడు నావలపు
(॥నీకే॥)
నేను నీవుఁ గూడుక నిండుసరసాలాడఁగ
నానాటఁ బెరిగెఁగా నా వలపు
పేని పట్టి నీతోడ బెనఁగులాడఁగాను
నానెఁగా చెమటల నా వలపు
(॥నీకే॥)
కూరిములు నీమీఁద కొసరి నేఁ జల్లఁగాను
నారుకొని బలిసెఁగా నా వలపు
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
నారతులె తెలిపెఁగా నావలపు
(||pallavi||)
nīgemi yiṁdarilo nene raṭṭaidim̐ gāga
segŏni magavām̐ ḍemisesinām̐ jĕllunu
(||nīge||)
vĕgaḍugā nenu nīvĕṁṭavĕṁṭam̐dirugam̐gā
nagum̐bāḍulāyam̐gā nā valabu
nigiḍi kaṭṭu gāsuga nīvāgiḍa nuṁḍam̐gānu
nagaru vuṭṭĕm̐gā nem̐ḍu nāvalabu
(||nīge||)
nenu nīvum̐ gūḍuga niṁḍusarasālāḍam̐ga
nānāḍam̐ bĕrigĕm̐gā nā valabu
peni paṭṭi nīdoḍa bĕnam̐gulāḍam̐gānu
nānĕm̐gā sĕmaḍala nā valabu
(||nīge||)
kūrimulu nīmīm̐da kŏsari nem̐ jallam̐gānu
nārugŏni balisĕm̐gā nā valabu
yīrīdi śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
nāradulĕ tĕlibĕm̐gā nāvalabu