Neegela priyamu seppa nelamtala kevvarigi

నీకేల ప్రియము చెప్ప నెలఁతల కెవ్వరికి
Language

(॥పల్లవి॥)
నీకేల ప్రియము చెప్ప నెలఁతల కెవ్వరికి
వాకైనవారేకా నీ వనితలు

(॥నీకే॥)
బింకమాడేయట్టి వేళ ప్రియములు చెప్పి నీకు
వంక లొత్తఁగలరుగా వద్దివారు
జంకించేటి సతులతో సందిమాటలాడియాడి
లంకెలు సేసేరుగా నీ లలనలు

(॥నీకే॥)
తప్పు మోఁచినట్టి వేళ తగవులెల్లా నెరపి
వొప్పులు సేతురుగా నీ వొద్దివారు
అప్పటప్పటికి నింతు లలిగి వుండేవేళ
కప్పురవిడే లూడిగాలవారిత్తురుగా

(॥నీకే॥)
వెగ్గళించినట్టి వేళ వేసాలెల్లా నీకుఁజూపి
వొగ్గి నిన్ను మెత్తురుగా వొద్దివారు
యెగ్గుదీర శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
సిగ్గులు వాపేరుగా నీ చెలిమికత్తియలు

(||pallavi||)
nīgela priyamu sĕppa nĕlam̐tala kĕvvarigi
vāgainavāregā nī vanidalu

(||nīge||)
biṁkamāḍeyaṭṭi veḽa priyamulu sĕppi nīgu
vaṁka lŏttam̐galarugā vaddivāru
jaṁkiṁcheḍi sadulado saṁdimāḍalāḍiyāḍi
laṁkĕlu seserugā nī lalanalu

(||nīge||)
tappu mom̐sinaṭṭi veḽa tagavulĕllā nĕrabi
vŏppulu sedurugā nī vŏddivāru
appaḍappaḍigi niṁtu laligi vuṁḍeveḽa
kappuraviḍe lūḍigālavāritturugā

(||nīge||)
vĕggaḽiṁchinaṭṭi veḽa vesālĕllā nīgum̐jūbi
vŏggi ninnu mĕtturugā vŏddivāru
yĕggudīra śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
siggulu vāberugā nī sĕlimigattiyalu