(॥పల్లవి॥)
నీకే తెలుసునయ్య నీచేఁతలు
యేకొలఁది కాకొలఁది కెందుకైనా వచ్చును
(॥నీకే॥)
నాతో నీవు నవ్వఁగ నగకుండవచ్చునా
యీతల నందుకే చన్నులేల పట్టేవు
ఘాతల మోనాన నుంటే కడు గర్విననవా
యేతుల దొరలపొందు లెందుకైనా వచ్చును
(॥నీకే॥)
వూరకే మాటాడితే నే నూఁకొనకుండవచ్చునా
మేర మీరి నీపాదము మీఁద వేసేవు
కోరి గుట్టున నేనుంటే కుచ్చితమిదనవా
యీరీతి నీతోడిమేలా లెందుకైనా వచ్చును
(॥నీకే॥)
గుట్టున నీవు గూడఁగఁ గూడకుండవచ్చునా
వొట్టి యందుకే గురుతు లొనరించేవు
అట్టె శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
యెట్టయిన నీమన్నన లెందుకైనా వచ్చును
(||pallavi||)
nīge tĕlusunayya nīsem̐talu
yegŏlam̐di kāgŏlam̐di kĕṁdugainā vachchunu
(||nīge||)
nādo nīvu navvam̐ga nagaguṁḍavachchunā
yīdala naṁduge sannulela paṭṭevu
ghādala monāna nuṁṭe kaḍu garvinanavā
yedula dŏralabŏṁdu lĕṁdugainā vachchunu
(||nīge||)
vūrage māḍāḍide ne nūm̐kŏnaguṁḍavachchunā
mera mīri nībādamu mīm̐da vesevu
kori guṭṭuna nenuṁṭe kuchchidamidanavā
yīrīdi nīdoḍimelā lĕṁdugainā vachchunu
(||nīge||)
guṭṭuna nīvu gūḍam̐gam̐ gūḍaguṁḍavachchunā
vŏṭṭi yaṁduge gurudu lŏnariṁchevu
aṭṭĕ śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
yĕṭṭayina nīmannana lĕṁdugainā vachchunu