Neege telusunayya ne memanemu ninnu

నీకే తెలుసునయ్య నే మేమనేము నిన్ను
Language

(॥పల్లవి॥)
నీకే తెలుసునయ్య నే మేమనేము నిన్ను
రాకపోక తరితీపు రసము గారీనా

(॥నీకే॥)
కాంతతోడ వేరొకతెకతలెల్లాఁ జెప్పిచెప్పి
బంతినే సారెకునుఁ గోపాలు రేఁచేవు
ఇంతేసి నీవు సేయఁగా యీపె నిన్నుఁ దిట్టఁగాను
చెంతనున్న వలపులు చిగిరించెనా

(॥నీకే॥)
వుదివకు నీసతులవుంగరాలు చూపిచూపి
కవకవనవ్వుచుఁ గాఁకలు రేచేవు
చని నీవు వుట్టింపఁగా సతి నీతోఁబెనఁగఁగా
నవకపువయసులు ననలొత్తెనా

(॥నీకే॥)
యీసతికి వాడవారియీడులెలాఁ బెట్టిపెట్టి
ఆస వుట్టించి కాఁగిట నానింపించేవు
బాసల శ్రీవేంకటేశ పైకొనఁగా నిద్దరికి
పాసికూడినరతులు పంటవండెనా

(||pallavi||)
nīge tĕlusunayya ne memanemu ninnu
rāgaboga taridību rasamu gārīnā

(||nīge||)
kāṁtadoḍa verŏgadĕgadalĕllām̐ jĕppisĕppi
baṁtine sārĕgunum̐ gobālu rem̐sevu
iṁtesi nīvu seyam̐gā yībĕ ninnum̐ diṭṭam̐gānu
sĕṁtanunna valabulu sigiriṁchĕnā

(||nīge||)
vudivagu nīsadulavuṁgarālu sūbisūbi
kavagavanavvusum̐ gām̐kalu resevu
sani nīvu vuṭṭiṁpam̐gā sadi nīdom̐bĕnam̐gam̐gā
navagabuvayasulu nanalŏttĕnā

(||nīge||)
yīsadigi vāḍavāriyīḍulĕlām̐ bĕṭṭibĕṭṭi
āsa vuṭṭiṁchi kām̐giḍa nāniṁpiṁchevu
bāsala śhrīveṁkaḍeśha paigŏnam̐gā niddarigi
pāsigūḍinaradulu paṁṭavaṁḍĕnā