Neege telusumgaaga nerajaanadanamellaa

నీకే తెలుసుఁగాక నెరజాణతనమెల్లా
Language

(॥పల్లవి॥)
నీకే తెలుసుఁగాక నెరజాణతనమెల్లా
పైకొని నిన్నుఁ గొసరేపాటివారమా

(॥నీకే॥)
పంతమాడేవారితోడ బలుపు చూపుటగాక
మంతనాన నవ్వఁగాను మన్నించవద్దా
వింతవాఁడనా నీవు వెలఁదిలా గెఱఁగవా
పొంతనుండి విన్నవించి పోదిసేయఁగలమా

(॥నీకే॥)
చలపట్టినవారితో సాదించుటగాక
మలసి మొక్కేటివారి మన్నించవద్దా
పెలుమనసా నీది ప్రియము నీ వెఱఁగవా
తలఁపించి నీమీఁదితరవుకత్తెలమా

(॥నీకే॥)
గరివించినవారితో గరిసించవలెఁగాక
మరిగి కూడినవారి మన్నించవద్దా
అరిది శ్రీవేంకటేశ అలమేలుమగ యీకె
వురముపై నుండఁగా నిన్నొడబఱచేమా

(||pallavi||)
nīge tĕlusum̐gāga nĕrajāṇadanamĕllā
paigŏni ninnum̐ gŏsarebāḍivāramā

(||nīge||)
paṁtamāḍevāridoḍa balubu sūbuḍagāga
maṁtanāna navvam̐gānu manniṁchavaddā
viṁtavām̐ḍanā nīvu vĕlam̐dilā gĕṟam̐gavā
pŏṁtanuṁḍi vinnaviṁchi podiseyam̐galamā

(||nīge||)
salabaṭṭinavārido sādiṁchuḍagāga
malasi mŏkkeḍivāri manniṁchavaddā
pĕlumanasā nīdi priyamu nī vĕṟam̐gavā
talam̐piṁchi nīmīm̐didaravugattĕlamā

(||nīge||)
gariviṁchinavārido garisiṁchavalĕm̐gāga
marigi kūḍinavāri manniṁchavaddā
aridi śhrīveṁkaḍeśha alamelumaga yīgĕ
vuramubai nuṁḍam̐gā ninnŏḍabaṟasemā