Neege melugadave nee padi sarasamulu

నీకే మేలుగదవే నీ పతి సరసములు
Language

(॥పల్లవి॥)
నీకే మేలుగదవే నీ పతి సరసములు
దాకొని నిలువుననే తమి నూరువండీని

(॥నీకే॥)
కోపగించుకొనకువే కోరి యాతఁడేమనినా
తీపులమాటలవెంటఁ దేనె గారీని
యేపున వేసరకువే యిట్టె చెనకితేను
రాపుల గోరికొననే రాలీని వలపు

(॥నీకే॥)
సిగ్గులువడకువే చెంత నాతఁ డుండితేను
వెగ్గళపువినయాన వెన్న వుట్టీని
బగ్గనఁ దిట్టకునే పయ్యదకొం గంటితేను
వొగ్గి వుంగరపువేళ్ళ నొరపు మించీని

(॥నీకే॥)
కొసరకువే నిన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు
సుసరపురతులను సుంకు మోపీని
అసురుసురనకువే అన్నిటాఁ బెనఁగితేను
వెసఁ గనుచూపుల వెన్నెలగాసీని

(||pallavi||)
nīge melugadave nī padi sarasamulu
dāgŏni niluvunane tami nūruvaṁḍīni

(||nīge||)
kobagiṁchugŏnaguve kori yādam̐ḍemaninā
tībulamāḍalavĕṁṭam̐ denĕ gārīni
yebuna vesaraguve yiṭṭĕ sĕnagidenu
rābula gorigŏnane rālīni valabu

(||nīge||)
sigguluvaḍaguve sĕṁta nādam̐ ḍuṁḍidenu
vĕggaḽabuvinayāna vĕnna vuṭṭīni
bagganam̐ diṭṭagune payyadagŏṁ gaṁṭidenu
vŏggi vuṁgarabuveḽḽa nŏrabu miṁchīni

(||nīge||)
kŏsaraguve ninnum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
susaraburadulanu suṁku mobīni
asurusuranaguve anniḍām̐ bĕnam̐gidenu
vĕsam̐ ganusūbula vĕnnĕlagāsīni