Neegamtem jalamari nelamtagum jepparaadu

నీకంటెఁ జలమరి నెలఁతకుఁ జెప్పరాదు
Language

(॥పల్లవి॥)
నీకంటెఁ జలమరి నెలఁతకుఁ జెప్పరాదు
దాకొని నీవు నవ్వితే తానే కాఁగిలించీని

(॥నీకం॥)
పయ్యదమీదఁద నీవు పన్నీరు చల్లఁగాను
వొయ్యనే లోలోనే తిట్టె వువిద నిన్ను
కయ్యమడిచీ నిందుకగా కాఁకలఁ బొరలనేల
వుయ్యాలపైకి రారాదా వొక్కటిసేసేను

(॥నీకం॥)
పువ్వుల చెండునఁగొని పూఁచి నీవు వేయఁగాను
జవ్వని బొమ్మల నిన్ను జంకించెను
అవ్వల నిందుకుఁగాను అసురుసురననేల
పవ్వళించరాదా వద్ద పంతాలు దిద్దేను

(॥నీకం॥)
శ్రీవేంకటేశ నీవు చెలిగుబ్బ లంటఁగాను
కావరించి యాకె మోవి గంటిసేసెను
చేవదేర నిందుకుఁగా సిగ్గులు వడఁగనేల
బావించి కప్రమీరాదా బత్తి నేఁ జేపేను

(||pallavi||)
nīgaṁṭĕm̐ jalamari nĕlam̐tagum̐ jĕpparādu
dāgŏni nīvu navvide tāne kām̐giliṁchīni

(||nīgaṁ||)
payyadamīdam̐da nīvu pannīru sallam̐gānu
vŏyyane lolone tiṭṭĕ vuvida ninnu
kayyamaḍisī niṁdugagā kām̐kalam̐ bŏralanela
vuyyālabaigi rārādā vŏkkaḍisesenu

(||nīgaṁ||)
puvvula sĕṁḍunam̐gŏni pūm̐si nīvu veyam̐gānu
javvani bŏmmala ninnu jaṁkiṁchĕnu
avvala niṁdugum̐gānu asurusurananela
pavvaḽiṁcharādā vadda paṁtālu diddenu

(||nīgaṁ||)
śhrīveṁkaḍeśha nīvu sĕligubba laṁṭam̐gānu
kāvariṁchi yāgĕ movi gaṁṭisesĕnu
sevadera niṁdugum̐gā siggulu vaḍam̐ganela
bāviṁchi kapramīrādā batti nem̐ jebenu