నీకంటె నాతఁడు మేలు నీ వాతనికంటె మేలు
(॥పల్లవి॥)
నీకంటె నాతఁడు మేలు నీ వాతనికంటె మేలు
చేకొని యాతని నిట్టె చెలఁగించఁగదవే
(॥నీకంటె॥)
నాలుక తుదలనే నయములు నవ్వులతోడివే మెచ్చులు
తాలిమి చేతివే గుణములు తగవులలోనివే మెచ్చులు
పోలిక వలనివే రూపులు పూచినకొలఁదులే పూఁపలు
జోలిఁబెట్టక పతిఁ జొక్కించఁగదవే
(॥నీకంటె॥)
పెనఁగులలంకెలే పొందులు పెదవల మీఁదివే ప్రియములు
మనసులోనివే మర్మాలు మచ్చికగలయంతె మాఁటలు
ననుపుల వెంటవే యాసలు నమ్మిన చోటివే చనవులు
కనుఁగొని పతిమతి గరఁగించఁగదవే
(॥నీకంటె॥)
వాడికల పొంతవే వరుసలు దండలవె మొగమోటలు
వేడుకల యందలివె కోరికలు వినోదాల సంగడివెచెనకులు
కూడె నిన్ను నిన్నటాను కూరిమితో మన్నించి
యీడ శ్రీవేంకటేశ కింపు రేఁచఁగదవే
(||pallavi||)
nīgaṁṭĕ nādam̐ḍu melu nī vādanigaṁṭĕ melu
segŏni yādani niṭṭĕ sĕlam̐giṁcham̐gadave
(||nīgaṁṭĕ||)
nāluga tudalane nayamulu navvuladoḍive mĕchchulu
tālimi sedive guṇamulu tagavulalonive mĕchchulu
poliga valanive rūbulu pūsinagŏlam̐dule pūm̐palu
jolim̐bĕṭṭaga padim̐ jŏkkiṁcham̐gadave
(||nīgaṁṭĕ||)
pĕnam̐gulalaṁkĕle pŏṁdulu pĕdavala mīm̐dive priyamulu
manasulonive marmālu machchigagalayaṁtĕ mām̐ṭalu
nanubula vĕṁṭave yāsalu nammina soḍive sanavulu
kanum̐gŏni padimadi garam̐giṁcham̐gadave
(||nīgaṁṭĕ||)
vāḍigala pŏṁtave varusalu daṁḍalavĕ mŏgamoḍalu
veḍugala yaṁdalivĕ korigalu vinodāla saṁgaḍivĕsĕnagulu
kūḍĕ ninnu ninnaḍānu kūrimido manniṁchi
yīḍa śhrīveṁkaḍeśha kiṁpu rem̐sam̐gadave