నీకంటే మునుపను నిన్ను నే రమ్మనఁగానే
(॥పల్లవి॥)
నీకంటే మునుపను నిన్ను నే రమ్మనఁగానే
వాకుచ్చి పిలిచేవు వలెరా యీవలపు
(॥నీకం॥)
వొక్కటయ్యే ననఁగానే వొద్దికిఁ జెలి నంపేవు
చిక్కనినవ్వులు వచ్చీ సేయరా సేఁత
నిక్కిచూచేననఁగానే నీవే విచ్చేసితివి
చెక్కులెల్లాఁ జెమరించెఁ జెప్పరా మాఁట
(॥నీకం॥)
వీడెమిచ్చేననఁగానే వేగమే చేయి చాఁచేవు
జోడుగా మయిఁ బులకించె చూడరా చూపు
వేఁడుకొనే ననఁగానే వేగమే నాకు మొక్కేవు
వాడుదేరె నా మోము వంచరా నీ కరుణ
(॥నీకం॥)
కాఁగిలించే ననఁగానే గక్కున నన్నేలితివి
మాఁగె నాచిత్తమంతయు మానరా జోలి
దాఁగక శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
చేఁగదేరెఁ బనులెల్లా చెల్లించరాదా
(||pallavi||)
nīgaṁṭe munubanu ninnu ne rammanam̐gāne
vāguchchi pilisevu valĕrā yīvalabu
(||nīgaṁ||)
vŏkkaḍayye nanam̐gāne vŏddigim̐ jĕli naṁpevu
sikkaninavvulu vachchī seyarā sem̐ta
nikkisūsenanam̐gāne nīve vichchesidivi
sĕkkulĕllām̐ jĕmariṁchĕm̐ jĕpparā mām̐ṭa
(||nīgaṁ||)
vīḍĕmichchenanam̐gāne vegame seyi sām̐sevu
joḍugā mayim̐ bulagiṁchĕ sūḍarā sūbu
vem̐ḍugŏne nanam̐gāne vegame nāgu mŏkkevu
vāḍuderĕ nā momu vaṁcharā nī karuṇa
(||nīgaṁ||)
kām̐giliṁche nanam̐gāne gakkuna nannelidivi
mām̐gĕ nāsittamaṁtayu mānarā joli
dām̐gaga śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
sem̐gaderĕm̐ banulĕllā sĕlliṁcharādā