Neegamta galigidenu neevu naa yeedugu raave

నీకంత గలిగితేను నీవు నా యీడుకు రావే
Language

(॥పల్లవి॥)
నీకంత గలిగితేను నీవు నా యీడుకు రావే
చేకొని నీ యెమ్మె లేమి చెప్పవచ్చేవే

(॥నీకంత॥)
పంతములే వలసితే పను లీడేరించవలె
వంతులకుఁ బెనఁగితే వాసి వలెను
చెంతల మాఁటాడితేను చెల్లుబడి గావలె
ఇంతిరో నాతోడి సాటి కేలవచ్చేవే

(॥నీకంత॥)
దొరతనమే కలిగితే తోడ సరిఁదూగవలె
సరసము లాడేనంటే జాణ గావలె
వరుస వం తడిగితే వలపించనేరవలె
తరుణిరో నాతో నెంత తగవుకు వచ్చేవే

(॥నీకంత॥)
రచ్చకెక్కఁ జెనకితే రతులఁ జొక్కించవలె
యిచ్చగించి నవ్వితేను యింపుగావలె
యిచ్చట శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నేలినాఁడు
నెచ్చెలిరో నన్ను నేమి నిక్కిచూడ వచ్చేవే

(||pallavi||)
nīgaṁta galigidenu nīvu nā yīḍugu rāve
segŏni nī yĕmmĕ lemi sĕppavachcheve

(||nīgaṁta||)
paṁtamule valaside panu līḍeriṁchavalĕ
vaṁtulagum̐ bĕnam̐gide vāsi valĕnu
sĕṁtala mām̐ṭāḍidenu sĕllubaḍi gāvalĕ
iṁtiro nādoḍi sāḍi kelavachcheve

(||nīgaṁta||)
dŏradaname kaligide toḍa sarim̐dūgavalĕ
sarasamu lāḍenaṁṭe jāṇa gāvalĕ
varusa vaṁ taḍigide valabiṁchaneravalĕ
taruṇiro nādo nĕṁta tagavugu vachcheve

(||nīgaṁta||)
rachchagĕkkam̐ jĕnagide radulam̐ jŏkkiṁchavalĕ
yichchagiṁchi navvidenu yiṁpugāvalĕ
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannelinām̐ḍu
nĕchchĕliro nannu nemi nikkisūḍa vachcheve