నీతో నేమిచెప్పేవు నాయము లేమడిగేవు
(॥పల్లవి॥)
నీతో నేమిచెప్పేవు నాయము లేమడిగేవు
కాతరించితే సతులు కడు మీరకుందురా
(॥నీతో॥)
పూడిగము సేసేయట్టి పువిదలతో నవ్వితే
యీడుజోడై నీ బుజ మెక్కకుందా
వాడలోన దిరిగాడేవారితో జూజమాడితే
కూడినపందెము నిన్నుఁ గొనకుందురా
(॥నీతో॥)
కొలవు సేసేవారితో కోరి సరసమాడితే
అలరి మాటకు మాట ఆడకుందురా
వెలపలివారిఁ దెచ్చి వెస లోన నిడుకొంటే
చలపట్టి నీతోడి సరికి రాకుందురా
(॥నీతో॥)
కడవారచేత నీవు కానికె లందుకొంటే
సుడిగొని మోవి చవిచూడకుందురా
కడఁగి శ్రీవేంకటేశ కమ్మర నన్నేలితివి
విడెమందుకొన్నవారు వియ్యమందకుందురా
(||pallavi||)
nīdo nemisĕppevu nāyamu lemaḍigevu
kādariṁchide sadulu kaḍu mīraguṁdurā
(||nīdo||)
pūḍigamu seseyaṭṭi puvidalado navvide
yīḍujoḍai nī buja mĕkkaguṁdā
vāḍalona dirigāḍevārido jūjamāḍide
kūḍinabaṁdĕmu ninnum̐ gŏnaguṁdurā
(||nīdo||)
kŏlavu sesevārido kori sarasamāḍide
alari māḍagu māḍa āḍaguṁdurā
vĕlabalivārim̐ dĕchchi vĕsa lona niḍugŏṁṭe
salabaṭṭi nīdoḍi sarigi rāguṁdurā
(||nīdo||)
kaḍavāraseda nīvu kānigĕ laṁdugŏṁṭe
suḍigŏni movi savisūḍaguṁdurā
kaḍam̐gi śhrīveṁkaḍeśha kammara nannelidivi
viḍĕmaṁdugŏnnavāru viyyamaṁdaguṁdurā