Needa numdi yalasevu nikki soosi solasevu

నీడ నుండి యలసేవు నిక్కి చూచి సొలసేవు
Language

(॥పల్లవి॥)
నీడ నుండి యలసేవు నిక్కి చూచి సొలసేవు
జోడైన పతికింతాఁ జూపరాదా నీవు

(॥నీడ॥)
కప్పురపుఁ బలుకులు కలికి నీ పలుకులు
ముప్పిరి జెమటవాన మోహపుసోన
చిప్పిలునీమోవితీపు చిత్తజునివింటికోపు
ఇప్పుడీ భావానఁ బతిఇంటికి రారాదా

(॥నీడ॥)
జక్కవ పక్షులతీరు సతి నీవయ్యద జారు
చెక్కిట ముత్యాలముగ్గు చెలి నీసిగ్గు
చొక్కపు వెన్నెల పువ్వు సుదతి నీ లేఁత నవ్వు
చుక్కలనీపతి వద్దఁ జూపవద్దా యిపుడు

(॥నీడ॥)
కామిని నీతొంగి చూపు కారుమెరుఁగులరూపు
దోమటి నీకొప్పతీరు తుమ్మిదనారు
ఆమని శ్రీవేంకటేశు నంతలోనె కూడితివి
వేమరు నాతని మీఁద విఱ్ఱవీఁగవమ్మా

(||pallavi||)
nīḍa nuṁḍi yalasevu nikki sūsi sŏlasevu
joḍaina padigiṁtām̐ jūbarādā nīvu

(||nīḍa||)
kappurabum̐ balugulu kaligi nī palugulu
muppiri jĕmaḍavāna mohabusona
sippilunīmovidību sittajuniviṁṭigobu
ippuḍī bhāvānam̐ badiiṁṭigi rārādā

(||nīḍa||)
jakkava pakṣhuladīru sadi nīvayyada jāru
sĕkkiḍa mutyālamuggu sĕli nīsiggu
sŏkkabu vĕnnĕla puvvu sudadi nī lem̐ta navvu
sukkalanībadi vaddam̐ jūbavaddā yibuḍu

(||nīḍa||)
kāmini nīdŏṁgi sūbu kārumĕrum̐gularūbu
domaḍi nīgŏppadīru tummidanāru
āmani śhrīveṁkaḍeśhu naṁtalonĕ kūḍidivi
vemaru nādani mīm̐da viṭravīm̐gavammā