(॥పల్లవి॥)
నీ యంత నేరమా నే మెల్లాను
చేయరాఁ బతి యిచ్చలోఁ జెలఁగేము గాకా
(॥నీ యంత॥)
ఆటలెన్త్నెనాఁ గలవు అట్టె జూజా లాడితేను
చోటు లెన్త్నెనాఁ గలవు చొచ్చివెళ్లితే
నీటు లెన్త్నెనాఁ గలవు నిక్కి నిక్కి నిక్కిచూచితేను
యేఁటికింత రమణుని నెలయించేవే
(॥నీ యంత॥)
బాస లెన్త్నెనాఁ గలవు పలుమారుఁ జేసితేను
ఆస లెన్త్నెనాఁ గలవు అడిగేనంటే
వేసా లెన్త్నెనాఁ గలవు వేగినంతా సొలసితే
రాసికెక్కఁ బతి నెంత రవ్వసేసేవే
(॥నీ యంత॥)
చేఁత లెన్త్నెనాఁ గలవు చిక్కించుక చెనకితే
వాత లెన్త్నెనాఁ గలవు వాసేనంటే
వూఁతగా శ్రీవేంకటేశుఁ డొద్దికతో నన్ను నేలె
కాఁతాళిం చేతని నేల కాఁగిలించేవే
(||pallavi||)
nī yaṁta neramā ne mĕllānu
seyarām̐ badi yichchalom̐ jĕlam̐gemu gāgā
(||nī yaṁta||)
āḍalĕndnĕnām̐ galavu aṭṭĕ jūjā lāḍidenu
soḍu lĕndnĕnām̐ galavu sŏchchivĕḽlide
nīḍu lĕndnĕnām̐ galavu nikki nikki nikkisūsidenu
yem̐ṭigiṁta ramaṇuni nĕlayiṁcheve
(||nī yaṁta||)
bāsa lĕndnĕnām̐ galavu palumārum̐ jesidenu
āsa lĕndnĕnām̐ galavu aḍigenaṁṭe
vesā lĕndnĕnām̐ galavu veginaṁtā sŏlaside
rāsigĕkkam̐ badi nĕṁta ravvaseseve
(||nī yaṁta||)
sem̐ta lĕndnĕnām̐ galavu sikkiṁchuga sĕnagide
vāda lĕndnĕnām̐ galavu vāsenaṁṭe
vūm̐tagā śhrīveṁkaḍeśhum̐ ḍŏddigado nannu nelĕ
kām̐tāḽiṁ sedani nela kām̐giliṁcheve