నీ వొక్కటొక్కటే సేసి నెరసు లెంచేవుగాక
(॥పల్లవి॥)
నీ వొక్కటొక్కటే సేసి నెరసు లెంచేవుగాక
వోపలేని ఆపె మంచి వోజదే కాదా
(॥నీవొ॥)
చిప్పిలుమాఁట లాడఁగా సిగ్గులువడీఁగాక
కప్పి నీ కెప్పుడు నూడిగము సేయదా
దప్పికి మోవడుగఁగాఁ దలవంచుకోనిఁగాక
ముప్పిరి నిందాఁక నీమోము చూడదా
(॥నీవొ॥)
పచ్చిగాం జెనకఁగా నప్పటి నొడ్డుకొనెఁగాక
కచ్చుపెట్టి నీపై బత్తి కలదే కాదా
రచ్చలోఁ బిలువఁగాను రమణి జంకించెఁగాక
యిచ్చకురాలు నీకు నెప్పుడుఁ గాదా
(॥నీవొ॥)
చేయివట్టి తియ్యఁగాను చెక్కు నిన్ను నొత్తెఁగాక
ఆయాలు నీవెఱిఁగిన ఆపె కాదా
యీయెడ శ్రీవేంకటేశ యెనసితి వింతలోనె
పాయరాని వేడుకలపాలిదే కాదా
(||pallavi||)
nī vŏkkaḍŏkkaḍe sesi nĕrasu lĕṁchevugāga
vobaleni ābĕ maṁchi vojade kādā
(||nīvŏ||)
sippilumām̐ṭa lāḍam̐gā sigguluvaḍīm̐gāga
kappi nī kĕppuḍu nūḍigamu seyadā
dappigi movaḍugam̐gām̐ dalavaṁchugonim̐gāga
muppiri niṁdām̐ka nīmomu sūḍadā
(||nīvŏ||)
pachchigāṁ jĕnagam̐gā nappaḍi nŏḍḍugŏnĕm̐gāga
kachchubĕṭṭi nībai batti kalade kādā
rachchalom̐ biluvam̐gānu ramaṇi jaṁkiṁchĕm̐gāga
yichchagurālu nīgu nĕppuḍum̐ gādā
(||nīvŏ||)
seyivaṭṭi tiyyam̐gānu sĕkku ninnu nŏttĕm̐gāga
āyālu nīvĕṟim̐gina ābĕ kādā
yīyĕḍa śhrīveṁkaḍeśha yĕnasidi viṁtalonĕ
pāyarāni veḍugalabālide kādā