నీ వింతేసి నేర్చితివి నీ పతిని వలపించ
(॥పల్లవి॥)
నీ వింతేసి నేర్చితివి నీ పతిని వలపించ
కావరము రేఁచేది నీ కనుచూపే చెలియా
(॥నీవిం॥)
చక్కనినీవిభునికి చలము వుట్టించేదెల్లా
చెక్కుచేతితో డినీసిగ్గులే యమ్మా
అక్కజమై మీఁదమీఁద నాసలు వుట్టించేవి
మొక్కలు మొక్కేనీమురిపెమే చలియా
(॥నీవిం॥)
మచ్చికపతికి నీమర్మములు గరఁచేవి
మెచ్చులనీకుచముల మెఱుఁగే చెలీ
యిచ్చట నిన్ను మరిగి యెందునుఁ బాయనీనిది
యచ్చకపుమాఁటల నీయితవులే చెలియా
(॥నీవిం॥)
శ్రీవేంకటేశ్వరునిచిత్తము రప్పించేది
ఆవేళ నీరతులే అలమేల్మంగ
భావించ కాఁగిటఁ గూడి పంతము లిప్పించేవి
నీవేడుకలరతినేరుపులే చెలియా
(||pallavi||)
nī viṁtesi nersidivi nī padini valabiṁcha
kāvaramu rem̐sedi nī kanusūbe sĕliyā
(||nīviṁ||)
sakkaninīvibhunigi salamu vuṭṭiṁchedĕllā
sĕkkusedido ḍinīsiggule yammā
akkajamai mīm̐damīm̐da nāsalu vuṭṭiṁchevi
mŏkkalu mŏkkenīmuribĕme saliyā
(||nīviṁ||)
machchigabadigi nīmarmamulu garam̐sevi
mĕchchulanīgusamula mĕṟum̐ge sĕlī
yichchaḍa ninnu marigi yĕṁdunum̐ bāyanīnidi
yachchagabumām̐ṭala nīyidavule sĕliyā
(||nīviṁ||)
śhrīveṁkaḍeśhvarunisittamu rappiṁchedi
āveḽa nīradule alamelmaṁga
bhāviṁcha kām̐giḍam̐ gūḍi paṁtamu lippiṁchevi
nīveḍugalaradinerubule sĕliyā