నీ వెఱఁగనివి లేవు నెఱజాణవు
(॥పల్లవి॥)
నీ వెఱఁగనివి లేవు నెఱజాణవు
మోవితేనె కడునైతే మొగచాటౌనయ్యా
(॥నీవె॥)
దగ్గరి కూడుట కంటె తలపోఁతలే ఇతవు
వెగ్గళమైతేఁ గాదు విడువవయ్యా
సిగ్గుతో నవ్వుటకంటే చిమ్ముఁదిట్టులే యితవు
బక్కన నీకు మొక్కేము పదరకువయ్యా
(॥నీవె॥)
యెనసివుండుటకంటే యెరవెరవే యితవు
పనిలేదు పెనఁగక పదవయ్యా
తనిసి మాటాడుకంటే దవ్వులమాఁటే యితవు
కొనకెక్కె వలపులు కొసరకువయ్యా
(॥నీవె॥)
కాఁగిట నిద్రించుకంటె కాఁకఁ బొరలు టితవు
తోఁగితిఁ జెమటలచే తొలవయ్యా
వీఁగక శ్రీవేంటాద్రి విభుఁడ కూడితి విట్టె
దాఁగ విఁక వేడుకలు దక్కితి నోయయ్యా
(||pallavi||)
nī vĕṟam̐ganivi levu nĕṟajāṇavu
movidenĕ kaḍunaide mŏgasāḍaunayyā
(||nīvĕ||)
daggari kūḍuḍa kaṁṭĕ talabom̐tale idavu
vĕggaḽamaidem̐ gādu viḍuvavayyā
siggudo navvuḍagaṁṭe simmum̐diṭṭule yidavu
bakkana nīgu mŏkkemu padaraguvayyā
(||nīvĕ||)
yĕnasivuṁḍuḍagaṁṭe yĕravĕrave yidavu
paniledu pĕnam̐gaga padavayyā
tanisi māḍāḍugaṁṭe davvulamām̐ṭe yidavu
kŏnagĕkkĕ valabulu kŏsaraguvayyā
(||nīvĕ||)
kām̐giḍa nidriṁchugaṁṭĕ kām̐kam̐ bŏralu ṭidavu
tom̐gidim̐ jĕmaḍalase tŏlavayyā
vīm̐gaga śhrīveṁṭādri vibhum̐ḍa kūḍidi viṭṭĕ
dām̐ga vim̐ka veḍugalu dakkidi noyayyā