Nee veṟamganidaa yemi nenemta vinnavimche

నీ వెఱఁగనిదా యేమి నేనెంత విన్నవించే
Language

(॥పల్లవి॥)
నీ వెఱఁగనిదా యేమి నేనెంత విన్నవించే
కైవశమై వుండఁగానే గయ్యాళిఁ జేసేవు

(॥నీవె॥)
నగితేను నీతోను నంటు నటించఁగ వద్దా
మొగము చూచితేను మొక్కవద్దా
పగటునఁ బేరుకొంటే పైపైనూఁ కొనవద్దా
వెగటున మమ్మేల వీరిడిఁ జేసేవు

(॥నీవె॥)
మన్నించితే నీతోను మాటలాడనైనవద్దా
కన్నుసన్నలు చేసితేకరఁగవద్దా
చన్నులు నీ వంటఁగాను జంకించనైనవద్దా
ఇన్నిటా మమ్మిందుకేల యెడ్డలఁ జేసేవు

(॥నీవె॥)
చెనకఁగ నీతోను చెలిమి సేయఁగవద్దా
పెనఁగితే నించుకంత బిగియవద్దా
యెనసితివి శ్రీవేంకటేశ చమ్మటూరిలోన
తనియక మమ్మునేల దంటలఁ జేసేవు

(||pallavi||)
nī vĕṟam̐ganidā yemi nenĕṁta vinnaviṁche
kaivaśhamai vuṁḍam̐gāne gayyāḽim̐ jesevu

(||nīvĕ||)
nagidenu nīdonu naṁṭu naḍiṁcham̐ga vaddā
mŏgamu sūsidenu mŏkkavaddā
pagaḍunam̐ berugŏṁṭe paibainūm̐ kŏnavaddā
vĕgaḍuna mammela vīriḍim̐ jesevu

(||nīvĕ||)
manniṁchide nīdonu māḍalāḍanainavaddā
kannusannalu sesidegaram̐gavaddā
sannulu nī vaṁṭam̐gānu jaṁkiṁchanainavaddā
inniḍā mammiṁdugela yĕḍḍalam̐ jesevu

(||nīvĕ||)
sĕnagam̐ga nīdonu sĕlimi seyam̐gavaddā
pĕnam̐gide niṁchugaṁta bigiyavaddā
yĕnasidivi śhrīveṁkaḍeśha sammaḍūrilona
taniyaga mammunela daṁṭalam̐ jesevu