నీ వెప్పుడూ నావాఁడవే నీమన్నన నాకుఁ గద్దు
(॥పల్లవి॥)
నీ వెప్పుడూ నావాఁడవే నీమన్నన నాకుఁ గద్దు
వేవేలు భావించకుమీ వేడుకిది చాలును
(॥నీవె॥)
విన్నవించితినంటా విచారాలఁ బెట్టకుమీ
పన్ని నీచిత్తానఁ గలపాటే చాలును
సన్నలు సేసితినంటా సారెకు నలయకుమీ
వన్నెల నీయంత నీవు వచ్చినదే చాలును
(॥నీవె॥)
వలచి వుందాననంటా వంతలఁ బొరలకుమీ
తలఁచుకొన్నప్పటినీతగులే చాలు
సొలసి మొక్కిటినంటా చూచి వగవకుమీ
కలసి యేలేనంటా నీకరుణే చాలును
(॥నీవె॥)
ముందర నుందాననంటా మొగమోట బొంకకుమీ
చెంది నన్నుఁ గూడితిని శ్రీవేంకటేశ
అందపుటలమేల్ మంగ నంటినని నవ్వకుమీ
సందడి రతిపరవశము లివె చాలును
(||pallavi||)
nī vĕppuḍū nāvām̐ḍave nīmannana nāgum̐ gaddu
vevelu bhāviṁchagumī veḍugidi sālunu
(||nīvĕ||)
vinnaviṁchidinaṁṭā visārālam̐ bĕṭṭagumī
panni nīsittānam̐ galabāḍe sālunu
sannalu sesidinaṁṭā sārĕgu nalayagumī
vannĕla nīyaṁta nīvu vachchinade sālunu
(||nīvĕ||)
valasi vuṁdānanaṁṭā vaṁtalam̐ bŏralagumī
talam̐sugŏnnappaḍinīdagule sālu
sŏlasi mŏkkiḍinaṁṭā sūsi vagavagumī
kalasi yelenaṁṭā nīgaruṇe sālunu
(||nīvĕ||)
muṁdara nuṁdānanaṁṭā mŏgamoḍa bŏṁkagumī
sĕṁdi nannum̐ gūḍidini śhrīveṁkaḍeśha
aṁdabuḍalamel maṁga naṁṭinani navvagumī
saṁdaḍi radibaravaśhamu livĕ sālunu