Nee vemi sesinaanu neegum jellunu

నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును
Language

(॥పల్లవి॥)
నీ వేమి సేసినాను నీకుఁ జెల్లును
వేవేలు చందాలను వేఁడుకొనే నిన్నును

(॥నీవేమి॥)
మాఁటలు నాతో నాడుతా మళ్లి చూచే వేమి నీవు
ఆఁట దెవ్వతో చూచీనంటానో నిన్ను
చాటువెట్టుకొని కొంత సన్నలు సేసేవు నాతో
మాటిచ్చుకున్నాఁడవో మరియు నాపెకును

(॥నీవేమి॥)
వొద్దఁబండ్డుండి యవ్వల నొగిఁ జోటిచ్చుకుండేవు
నిద్దరించేవేళ నాపె నీవుఁ గూడేవో
వొద్దికఁ బుక్కిట దాఁచుకున్నాఁడవు తములము
చద్ది గట్టిపెట్టితివో సరుగ నాపెకును

(॥నీవేమి॥)
పొంకముగా జాగరాలఁ బొద్దువుచ్చ వాపెను
కంకణము గట్టి తొల్లె కలసితివో
అంకెల శ్రీవేంకటేశ అంతలో నన్నేలితివి
ఇంక నీకు వెఱపులే దెరుఁగదు నవ్వితి

(||pallavi||)
nī vemi sesinānu nīgum̐ jĕllunu
vevelu saṁdālanu vem̐ḍugŏne ninnunu

(||nīvemi||)
mām̐ṭalu nādo nāḍudā maḽli sūse vemi nīvu
ām̐ṭa dĕvvado sūsīnaṁṭāno ninnu
sāḍuvĕṭṭugŏni kŏṁta sannalu sesevu nādo
māḍichchugunnām̐ḍavo mariyu nābĕgunu

(||nīvemi||)
vŏddam̐baṁḍḍuṁḍi yavvala nŏgim̐ joḍichchuguṁḍevu
niddariṁcheveḽa nābĕ nīvum̐ gūḍevo
vŏddigam̐ bukkiḍa dām̐sugunnām̐ḍavu tamulamu
saddi gaṭṭibĕṭṭidivo saruga nābĕgunu

(||nīvemi||)
pŏṁkamugā jāgarālam̐ bŏdduvuchcha vābĕnu
kaṁkaṇamu gaṭṭi tŏllĕ kalasidivo
aṁkĕla śhrīveṁkaḍeśha aṁtalo nannelidivi
iṁka nīgu vĕṟabule dĕrum̐gadu navvidi