Nee talane vegenaa nelamta yidi

నీ తలనే వేగెనా నెలఁత యిది
Language

(॥పల్లవి॥)
నీ తలనే వేగెనా నెలఁత యిది
యీతలఁ బతిమాఁటలు యియ్యకొనఁగదవే

(॥నీత॥)
తలపోఁత లెక్కుడైతే తమకము గనమౌను
బలిమిఁ గలిగితేను పంతము రేఁగు
చలములు మిగిలితే సాదింపులు కొనసాగు
వలచినవారి కిది వదలని సాజము

(॥నీత॥)
కాఁకలు దఱచయితే కనుచూపు వాఁడౌను
ఆఁకవిరహములైతే ఆసమించును
వేఁకమైన వయసైతే వెరపులన్నియుఁ బాసు
యేఁకట గలవారికి యెప్పుడును సాజము

(॥నీత॥)
సిగ్గులు దఱచయితే సెలవుల నవ్వు నిండు
నెగ్గళించఁ జూచితేను వేడుక దక్కు
అగ్గమై శ్రీ వేంకటేశుఁ డప్పుడే నిన్నిదె కూడె
దగ్గరిన చుట్టాలకు తప్పదు యీసాజము

(||pallavi||)
nī talane vegĕnā nĕlam̐ta yidi
yīdalam̐ badimām̐ṭalu yiyyagŏnam̐gadave

(||nīda||)
talabom̐ta lĕkkuḍaide tamagamu ganamaunu
balimim̐ galigidenu paṁtamu rem̐gu
salamulu migilide sādiṁpulu kŏnasāgu
valasinavāri kidi vadalani sājamu

(||nīda||)
kām̐kalu daṟasayide kanusūbu vām̐ḍaunu
ām̐kavirahamulaide āsamiṁchunu
vem̐kamaina vayasaide vĕrabulanniyum̐ bāsu
yem̐kaḍa galavārigi yĕppuḍunu sājamu

(||nīda||)
siggulu daṟasayide sĕlavula navvu niṁḍu
nĕggaḽiṁcham̐ jūsidenu veḍuga dakku
aggamai śhrī veṁkaḍeśhum̐ ḍappuḍe ninnidĕ kūḍĕ
daggarina suṭṭālagu tappadu yīsājamu