నీ చుర చుర చుర చూపులే పంజా
పల్లవి:
నీ చుర చుర చుర చూపులే పంజా
సల సల సల ఊపిరే పంజా
నరనరమున నెత్తురే పంజా
అణువణువునా సత్తువే పంజా
అదుపెరుగని వేగమే పంజా
అదరని పెను ధైర్యమే పంజా
పెదవంచున మౌనమే పంజా
పదునగు ఆలోచనే పంజా
చరణం 1:
ఈ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి
తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి
ఆకాశం నీ పంజా...
అది గెలవాలి అసలైనా గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా...
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
చరణం 2:
ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా
ఎత్తు పల్లం లేనే లేని రహదారంటూ ఉందా
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా
ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలిగా
నీ అడుగడుగు అలజడిగా నీ జీవితమే నీ శత్రువు కాగా
బెదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా
ఆకాశం నీ పంజా...
అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా
ఆవేశం నీ పంజా...
అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా
pallavi:
nī sura sura sura sūbule paṁjā
sala sala sala ūbire paṁjā
naranaramuna nĕtture paṁjā
aṇuvaṇuvunā sattuve paṁjā
adubĕrugani vegame paṁjā
adarani pĕnu dhairyame paṁjā
pĕdavaṁchuna mauname paṁjā
padunagu ālosane paṁjā
saraṇaṁ 1:
ī sīgaḍilo sīgaḍigā mūsina musugā nippula baṁti
tappadane yuddhamugā veguva sūḍadā rebaḍi kāṁti
āgāśhaṁ nī paṁjā...
adi gĕlavāli asalainā guṁḍĕ dammugā
āveśhaṁ nī paṁjā...
aḍugĕyyāli sĕḍunaṁtaṁ sese saidanyaṁgā
saraṇaṁ 2:
āḍuboḍu lene leni sāgarame uṁṭuṁdā
ĕttu pallaṁ lene leni rahadāraṁṭū uṁdā
āgurālani kŏmmarĕmmalu sigurayye vīluṁdā
edemainā tudi varagu ĕdurīda sāgāligā
nī aḍugaḍugu alajaḍigā nī jīvidame nī śhatruvu kāgā
bĕdiriṁche ābadane ĕdiriṁche guṇamegā paṁjā
āgāśhaṁ nī paṁjā...
adi gĕlavāli asalaina guṁḍĕ dammugā
āveśhaṁ nī paṁjā...
aḍugĕyyāli sĕḍunaṁtaṁ sese saidanyaṁgā