Nee sugamu seruduraa nee vaaramu

నీ సుకము చెరుతురా నీ వారము
Language

(॥పల్లవి॥)
నీ సుకము చెరుతురా నీ వారము
లాసి తనంత వచ్చేది లాభము గాదా

(॥నీసు॥)
బండు బండుగా నెవ్వతె వట్టి నిన్నుఁ దీసినాను
కొండవలెఁ జూచుకుండే కొలువులోను
వెండియు నెవ్వతె వచ్చి వెంగెమాడి తిట్టినాను
అండ వూరకుండే వింటా నదె నా సేవ

(॥నీసు॥)
పట్టి నిన్నెవుతె తన పనులు సేయించినాను
పొట్టఁ బొరుగున నుండే పొగడుతాను
రట్టడిరతి కెవ్వతె ఇట్టె నిన్నుఁ దీసినాను
అట్టె బయము దెలిపే నదె నా సేవ

(॥నీసు॥)
విందు నీ కెవ్వతె వచ్చి వెంటనే చెప్పినాను
అందు నీ పొత్తుల నుండే నారగించఁగా
కందువ శ్రీ వేకంటేశ కలసితి విటు నన్ను
అందరికి నప్పణిచ్చే అదె నా సేవ

(||pallavi||)
nī sugamu sĕrudurā nī vāramu
lāsi tanaṁta vachchedi lābhamu gādā

(||nīsu||)
baṁḍu baṁḍugā nĕvvadĕ vaṭṭi ninnum̐ dīsinānu
kŏṁḍavalĕm̐ jūsuguṁḍe kŏluvulonu
vĕṁḍiyu nĕvvadĕ vachchi vĕṁgĕmāḍi tiṭṭinānu
aṁḍa vūraguṁḍe viṁṭā nadĕ nā seva

(||nīsu||)
paṭṭi ninnĕvudĕ tana panulu seyiṁchinānu
pŏṭṭam̐ bŏruguna nuṁḍe pŏgaḍudānu
raṭṭaḍiradi kĕvvadĕ iṭṭĕ ninnum̐ dīsinānu
aṭṭĕ bayamu dĕlibe nadĕ nā seva

(||nīsu||)
viṁdu nī kĕvvadĕ vachchi vĕṁṭane sĕppinānu
aṁdu nī pŏttula nuṁḍe nāragiṁcham̐gā
kaṁduva śhrī vegaṁṭeśha kalasidi viḍu nannu
aṁdarigi nappaṇichche adĕ nā seva