నీ చిత్తము వచ్చినట్టు నీవు నన్ను మన్నించు
(॥పల్లవి॥)
నీ చిత్తము వచ్చినట్టు నీవు నన్ను మన్నించు
యేచి నీకు నెదురాడ నియ్యకొందుఁగాని
(॥నీచి॥)
కంటకములాడనేర కసరులు నే నేర
నంటున నీమోము చేచి నవ్వుదుఁగాని
దంటనై జంకించనోప తప్పలు వట్టఁగనోప
వెంట వెంటాఁ జెక్కునొక్కి వేఁడుకొందుఁగాని
(॥నీచి॥)
కొచ్చి కొచ్చి చూడఁ జాల కోపగించుకొనఁజాల
ముచ్చటతోఁ జేతులెత్తి మొక్కుదుఁగాని
కుచ్చితా లెంచ నెరఁగ గుంపించ నెన్నఁ డెరఁగ
ఇచ్చకపుదాననై ఇంపు చూపుదుఁ గాని
(॥నీచి॥)
యెలయించెదానఁ గాను యెగ్గుపట్టేదానఁగాను
చెలరేఁగి సేవలెల్లాఁ జేతుఁగాని
యెలమి శ్రీవేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సొలపుల వొడిగట్టఁ జొక్కింతుఁగాని
(||pallavi||)
nī sittamu vachchinaṭṭu nīvu nannu manniṁchu
yesi nīgu nĕdurāḍa niyyagŏṁdum̐gāni
(||nīsi||)
kaṁṭagamulāḍanera kasarulu ne nera
naṁṭuna nīmomu sesi navvudum̐gāni
daṁṭanai jaṁkiṁchanoba tappalu vaṭṭam̐ganoba
vĕṁṭa vĕṁṭām̐ jĕkkunŏkki vem̐ḍugŏṁdum̐gāni
(||nīsi||)
kŏchchi kŏchchi sūḍam̐ jāla kobagiṁchugŏnam̐jāla
muchchaḍadom̐ jedulĕtti mŏkkudum̐gāni
kuchchidā lĕṁcha nĕram̐ga guṁpiṁcha nĕnnam̐ ḍĕram̐ga
ichchagabudānanai iṁpu sūbudum̐ gāni
(||nīsi||)
yĕlayiṁchĕdānam̐ gānu yĕggubaṭṭedānam̐gānu
sĕlarem̐gi sevalĕllām̐ jedum̐gāni
yĕlami śhrīveṁkaḍeśha inniḍā nannelidivi
sŏlabula vŏḍigaṭṭam̐ jŏkkiṁtum̐gāni