Nee sedilonidaana nenu nee sadi nimte

నీ చేతిలోనిదాన నేను నీ సతి నింతే
Language

(॥పల్లవి॥)
నీ చేతిలోనిదాన నేను నీ సతి నింతే
చీచీ పూచి మానేటి సెలవేల యిఁకను

(॥నీచే॥)
సొలసి చూడఁగలంతాఁ జూతువుగాక నన్ను
తలవంచ నిఁకనేల దాకొనెఁబని
మొలచెఁ బులకపైరు ముంచెఁ జెమటనీరు
కలువతూపులు వానికడమేల ఇఁకను

(॥నీచే॥)
ఆడెడిసరసమింతా నాడుదువుగాక నాతో
తోడ మొకమోటలేల దూరాయఁ బని
వీడెఁ దురుముభారము విరహమింతాఁ గారము
కూడేటిమరుకొంతాలకొరతేల ఇఁకను

(॥నీచే॥)
నవ్వఁగలిగినదెల్లా నవ్వుదువుగాక నీవు
రవ్వలగుట్టిఁక నేల రాఁపాయఁ బని
ఇవ్వల శ్రీవేంకటేశ యెన్నికగాఁ గూడితిని
మవ్వపు వెన్నెలచొక్కు మాననేల ఇఁకను

(||pallavi||)
nī sedilonidāna nenu nī sadi niṁte
sīsī pūsi māneḍi sĕlavela yim̐kanu

(||nīse||)
sŏlasi sūḍam̐galaṁtām̐ jūduvugāga nannu
talavaṁcha nim̐kanela dāgŏnĕm̐bani
mŏlasĕm̐ bulagabairu muṁchĕm̐ jĕmaḍanīru
kaluvadūbulu vānigaḍamela im̐kanu

(||nīse||)
āḍĕḍisarasamiṁtā nāḍuduvugāga nādo
toḍa mŏgamoḍalela dūrāyam̐ bani
vīḍĕm̐ durumubhāramu virahamiṁtām̐ gāramu
kūḍeḍimarugŏṁtālagŏradela im̐kanu

(||nīse||)
navvam̐galiginadĕllā navvuduvugāga nīvu
ravvalaguṭṭim̐ka nela rām̐pāyam̐ bani
ivvala śhrīveṁkaḍeśha yĕnnigagām̐ gūḍidini
mavvabu vĕnnĕlasŏkku mānanela im̐kanu