Nee salamu neegum jelle nerubulela

నీ చలము నీకుఁ జెల్లె నేరుపులేల
Language

(॥పల్లవి॥)
నీ చలము నీకుఁ జెల్లె నేరుపులేల
చేచేత నీవంటఁగాను సిగ్గు లిఁకనేల

(॥నీచ॥)
మొగము చూచి నీకు మొక్కినయప్పుడే తొంటి
జగడములెల్లఁ బాసె జంకింపులేల
చిగురుమోవి యెత్తి చేరి మాటాడినపుడె
పగయెల్లాఁ దీరె మరి పంతములేలా

(॥నీచ॥)
చనవుసేసుక నీసంగడిఁ గూచున్నప్పుడె
కినుకలిన్నియుఁ దీరె కేరడాలేల
చెనకి నీకు నేను సేవలు సేసినప్పుడె
వెనకకోపము దీరె వేఁడుకొననేలా

(॥నీచ॥)
కైవశమై నిన్ను నేనుఁ గాఁగిలించుకొన్నప్పుడె
యేవలెల్లా ముగిసెను యెన్నికెలేల
శ్రీవేంకటేశ నీపై సేసనేఁ బెట్టినప్పుడె
చేవలు నిండె రతుల చిఱునవ్వులేలా

(||pallavi||)
nī salamu nīgum̐ jĕllĕ nerubulela
seseda nīvaṁṭam̐gānu siggu lim̐kanela

(||nīsa||)
mŏgamu sūsi nīgu mŏkkinayappuḍe tŏṁṭi
jagaḍamulĕllam̐ bāsĕ jaṁkiṁpulela
sigurumovi yĕtti seri māḍāḍinabuḍĕ
pagayĕllām̐ dīrĕ mari paṁtamulelā

(||nīsa||)
sanavusesuga nīsaṁgaḍim̐ gūsunnappuḍĕ
kinugalinniyum̐ dīrĕ keraḍālela
sĕnagi nīgu nenu sevalu sesinappuḍĕ
vĕnagagobamu dīrĕ vem̐ḍugŏnanelā

(||nīsa||)
kaivaśhamai ninnu nenum̐ gām̐giliṁchugŏnnappuḍĕ
yevalĕllā mugisĕnu yĕnnigĕlela
śhrīveṁkaḍeśha nībai sesanem̐ bĕṭṭinappuḍĕ
sevalu niṁḍĕ radula siṟunavvulelā