Nee pamtamu leedere nerubari vauduvayyaa

నీ పంతము లీడేరె నేరుపరి వౌదువయ్యా
Language

(॥పల్లవి॥)
నీ పంతము లీడేరె నేరుపరి వౌదువయ్యా
ఆ పనులు నాకుఁ జెప్పి ఆలిఁ జేసుకొంటివి

(॥నీపఁ॥)
చలముగల వారికి సాదించరానిదేమి
చెలులుగలవారికి సిగ్గులేని
మలసి మలసి నాతో మంతనము లాడియాడి
అలరి వలపు రేఁచి ఆలిఁజేసుకొంటివి

(॥నీపఁ॥)
వేసరనివారికి వెగ్గళ మేమున్నది
ఆసలుగల వారికి నలపులేని
వాసితోను నీవు మావాకిటనే కాచుకుండి
ఆసుద్దులు చెప్పిచెప్పి ఆలిఁ జేసుకొంటివి

(॥నీపఁ॥)
తాలిమిగలవారికి తగులని వేమున్నవి
యేలినవారికి నడ్డ మేమున్నది
యీలాగున శ్రీవేంకటేశ నీవు నన్నుఁగూడి
అలాగులనే నేఁడు అలిఁ జేసుకొంటివి

(||pallavi||)
nī paṁtamu līḍerĕ nerubari vauduvayyā
ā panulu nāgum̐ jĕppi ālim̐ jesugŏṁṭivi

(||nībam̐||)
salamugala vārigi sādiṁcharānidemi
sĕlulugalavārigi sigguleni
malasi malasi nādo maṁtanamu lāḍiyāḍi
alari valabu rem̐si ālim̐jesugŏṁṭivi

(||nībam̐||)
vesaranivārigi vĕggaḽa memunnadi
āsalugala vārigi nalabuleni
vāsidonu nīvu māvāgiḍane kāsuguṁḍi
āsuddulu sĕppisĕppi ālim̐ jesugŏṁṭivi

(||nībam̐||)
tālimigalavārigi tagulani vemunnavi
yelinavārigi naḍḍa memunnadi
yīlāguna śhrīveṁkaḍeśha nīvu nannum̐gūḍi
alāgulane nem̐ḍu alim̐ jesugŏṁṭivi