Nee padi battigalamdu ne neṟumgudu

నీ పతి బత్తిగలఁడు నే నెఱుఁగుదు
Language

(॥పల్లవి॥)
నీ పతి బత్తిగలఁడు నే నెఱుఁగుదు
దాపుగ నామాట లివి తలఁచుకోవే

(॥నీప॥)
సరసములాడుటే జడిగొన్న మోహము
శిరసు వంచుకొనుటే సిగ్గుఁబాట్లు
గరిమ నవ్వు మిక్కిలి ఘనమైనతరితీపు
సరిచూడవే వలపుజాడ లివి

(॥నీప॥)
చెప్పరాని వినయాలే చిత్తములో ఆసలు
తప్పక చూచుటే తగులాయము
వుప్పతిల్లుఁ జెనకులే వుడివోని తమకము
తిప్పరానికాంక్ష లివి తలుచుకోవే

(॥నీప॥)
మొగములు చూచుటే మంచినఇచ్చకములు
బగివాయకుండుటే చేపట్టినపొందు
అగపడి నిన్ను నేలె అదెశ్రీవేంకటేశుఁడు
మగనికి నీకు నీమర్మము లెంచుకోవే

(||pallavi||)
nī padi battigalam̐ḍu ne nĕṟum̐gudu
dābuga nāmāḍa livi talam̐sugove

(||nība||)
sarasamulāḍuḍe jaḍigŏnna mohamu
śhirasu vaṁchugŏnuḍe siggum̐bāṭlu
garima navvu mikkili ghanamainadaridību
sarisūḍave valabujāḍa livi

(||nība||)
sĕpparāni vinayāle sittamulo āsalu
tappaga sūsuḍe tagulāyamu
vuppadillum̐ jĕnagule vuḍivoni tamagamu
tipparānigāṁkṣha livi talusugove

(||nība||)
mŏgamulu sūsuḍe maṁchina̮ichchagamulu
bagivāyaguṁḍuḍe sebaṭṭinabŏṁdu
agabaḍi ninnu nelĕ adĕśhrīveṁkaḍeśhum̐ḍu
maganigi nīgu nīmarmamu lĕṁchugove