Nee navvu seppimdi naado nenevvaro ema&

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమ&
Work
Year
Language

పల్లవి:

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ లాల లాల ఓ ఓ లాలాలాలాల
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

చరణం 1:

నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
ఓ... నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
నాలో సాగిన నీ అడుగులో చూసాను మన నేర్పుని
పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని
ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని

చరణం 2:

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2)
వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ
నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ

చరణం 3:

ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
ఆ... ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో
తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు
మనమే మరోకొత్త జన్మం పొందేటి బంధాలతో

ఆ లాల లాల ఆఆ లాలాలాలాల
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

pallavi:

nī navvu sĕppiṁdi nādo nenĕvvaro emiḍo
nī nīḍa sūbiṁdi nālo innāḽḽa loḍemiḍo
o lāla lāla o o lālālālāla
nī navvu sĕppiṁdi nādo nenĕvvaro emiḍo
nī nīḍa sūbiṁdi nālo innāḽḽa loḍemiḍo

saraṇaṁ 1:

nāgai sāsina nī sedilo sadivānu nā ninnanī
o... nāgai sāsina nī sedilo sadivānu nā ninnanī
nālo sāgina nī aḍugulo sūsānu mana nerbuni
paṁcheṁduge ŏgaru leni bradugĕṁta baruvo ani
e toḍugī nosugoni naḍagĕṁta alubo ani

saraṇaṁ 2:

nallani nī kanubābalalo udayālu kanibiṁchanī (2)
vĕnnĕla pere vinibiṁchani naḍireyi karigiṁchanī
nā pĕdavilonū ilāge sirunavvu puḍuduṁdanī
nī siggu nā jīvidāna tŏlimuggu pĕḍuduṁdanī

saraṇaṁ 3:

enāḍaide ī jīvidaṁ rĕṭṭiṁpu baruvĕkkuno
ā... enāḍaide ī jīvidaṁ rĕṭṭiṁpu baruvĕkkuno
tanuvu manasu sĕrisagamani paṁchāli anibiṁchuno
sarigā ade śhubhamuhūrdaṁ saṁpūrṇamayyeṁdugu
maname marogŏtta janmaṁ pŏṁdeḍi baṁdhālado

ā lāla lāla āā lālālālāla
nī navvu sĕppiṁdi nādo nenĕvvaro emiḍo
nī nīḍa sūbiṁdi nālo innāḽḽa loḍemiḍo