నీ మోహము కొలదివే నేఁజేసే ప్రియము లివి
(॥పల్లవి॥)
నీ మోహము కొలదివే నేఁజేసే ప్రియము లివి
చే ముంచి ఇన్నిటికి నీచిత్తము నాభాగ్యము
(॥నీమో॥)
కతలెల్లా విన్నవించఁగలదానఁగాక నీకు
హితైయుండిన దింక నెట్టు దెలుసు
తతి నీకు విందుచెప్పేదానఁ గాక కూరాకులు
మతి కింపులయ్యేవి మరి యెట్టు దెలుసు
(॥నీమో॥)
ఆడుమంతే నీతో జూజ మాడఁగలదానఁగాక
యీడ నీకు వేడుకౌత యెట్టు దెలుసు
కూడిమాడి నీగుణాలు కొనియాడేదానఁగాక
జాడతో సమ్మతించేటి చంద మెట్టు దెలుసు
(॥నీమో॥)
చేరివుండి వూడిగము సేయఁగలదానఁగాక
యీరీతి నీవు మనిఁచె దెట్టు దెలుసు
ఆరయ శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
గారవించి యేలితివి గతు లెట్టు దెలుసు
(||pallavi||)
nī mohamu kŏladive nem̐jese priyamu livi
se muṁchi inniḍigi nīsittamu nābhāgyamu
(||nīmo||)
kadalĕllā vinnaviṁcham̐galadānam̐gāga nīgu
hidaiyuṁḍina diṁka nĕṭṭu dĕlusu
tadi nīgu viṁdusĕppedānam̐ gāga kūrāgulu
madi kiṁpulayyevi mari yĕṭṭu dĕlusu
(||nīmo||)
āḍumaṁte nīdo jūja māḍam̐galadānam̐gāga
yīḍa nīgu veḍugauda yĕṭṭu dĕlusu
kūḍimāḍi nīguṇālu kŏniyāḍedānam̐gāga
jāḍado sammadiṁcheḍi saṁda mĕṭṭu dĕlusu
(||nīmo||)
serivuṁḍi vūḍigamu seyam̐galadānam̐gāga
yīrīdi nīvu manim̐sĕ dĕṭṭu dĕlusu
āraya śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
gāraviṁchi yelidivi gadu lĕṭṭu dĕlusu