నీ మన సెఱఁగనా నిన్ను దూర దోసము
(॥పల్లవి॥)
నీ మన సెఱఁగనా నిన్ను దూర దోసము
కామించినవారి పొందు కైకొందువుగాక
(॥నీమన॥)
అంగనలు చెనకితే నౌఁగాదనేవాఁడవా
అంగవించి యందుకు లోనౌదువుగాక
కొంగువట్టితీసినాను కోపగించేవాఁడవా
ఇంగితమెఱిఁగి చనవిత్తువుగాక
(॥నీమ॥)
వెలఁదులు మాటాడితే వేసరేటివాఁడవా
వెలయ నెంతవడైనా విందువుగాక
వలపులు చల్లితేను వద్దనేటివాఁడవా
కెలన నియ్యకొని భోగింతువుగాక
(॥నీమ॥)
పెనఁగి కాఁగిలించితే బిగిసేటివాఁడవా
యెనసి రతులఁ జనవిత్తువుగాక
ఘనుఁడ శ్రీవేంకటేశ కైకొని నన్నేలితివి
మనసిచ్చి యందరిని మన్నింతువుగాక
(||pallavi||)
nī mana sĕṟam̐ganā ninnu dūra dosamu
kāmiṁchinavāri pŏṁdu kaigŏṁduvugāga
(||nīmana||)
aṁganalu sĕnagide naum̐gādanevām̐ḍavā
aṁgaviṁchi yaṁdugu lonauduvugāga
kŏṁguvaṭṭidīsinānu kobagiṁchevām̐ḍavā
iṁgidamĕṟim̐gi sanavittuvugāga
(||nīma||)
vĕlam̐dulu māḍāḍide vesareḍivām̐ḍavā
vĕlaya nĕṁtavaḍainā viṁduvugāga
valabulu sallidenu vaddaneḍivām̐ḍavā
kĕlana niyyagŏni bhogiṁtuvugāga
(||nīma||)
pĕnam̐gi kām̐giliṁchide bigiseḍivām̐ḍavā
yĕnasi radulam̐ janavittuvugāga
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kaigŏni nannelidivi
manasichchi yaṁdarini manniṁtuvugāga