నీ కొలఁదిదాననా నీ యంత నే నేరనా
(॥పల్లవి॥)
నీ కొలఁదిదాననా నీ యంత నే నేరనా
చేకొని యెంతేసి నీవు చేఁతలు సేసేవు
(॥నీకొ॥)
సరసములాడి యాడి సంగాతాలు సేసితివి
మరిగి నావద్దనున్న మగనితోను
తెరమరఁగున నుండి తేలించనేల వచ్చేవే
గరిమల నాకతఁడు కడుమేలువాఁడు
(॥నీకొ॥)
వలపులు చల్లి చల్లి వావి గడించుకొంటివి
బలిమి నావసమైన పతితోను
కొలువులోనే వుండి కోరి సన్నసేసేవేలే
కలకాలమితఁడు నాకడ మేలువాఁడు
(॥నీకొ॥)
కొప్పు దువ్విదువ్వి నీ కూటమి నెరపితివి
ఇప్పుడు నాశ్రీవేంకటేశునితోను
వొప్పుగ నన్నితఁ డేలె వొడివట్ట నేమిటికి
నెప్పుగ నీతఁడు నాకన్నిటా మేలువాఁడు
(||pallavi||)
nī kŏlam̐didānanā nī yaṁta ne neranā
segŏni yĕṁtesi nīvu sem̐talu sesevu
(||nīgŏ||)
sarasamulāḍi yāḍi saṁgādālu sesidivi
marigi nāvaddanunna maganidonu
tĕramaram̐guna nuṁḍi teliṁchanela vachcheve
garimala nāgadam̐ḍu kaḍumeluvām̐ḍu
(||nīgŏ||)
valabulu salli salli vāvi gaḍiṁchugŏṁṭivi
balimi nāvasamaina padidonu
kŏluvulone vuṁḍi kori sannasesevele
kalagālamidam̐ḍu nāgaḍa meluvām̐ḍu
(||nīgŏ||)
kŏppu duvviduvvi nī kūḍami nĕrabidivi
ippuḍu nāśhrīveṁkaḍeśhunidonu
vŏppuga nannidam̐ ḍelĕ vŏḍivaṭṭa nemiḍigi
nĕppuga nīdam̐ḍu nāganniḍā meluvām̐ḍu