పల్లవి:
నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోపతాపాలకు...ఆ తీపి శాపాలకు
ఈ కోపతాపాలకు ...ఆ తీపి శాపాలకు ..అందించనా నీకు హరిచందనాలు !
నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
చరణం 1:
కోటేరులాంటి ఆ కొస ముక్కు... ప్రొద్దు నిద్దర లేచినట్టు ఆ బొట్టు
మిసమిసలు పసిగట్టి కసిపట్టి బుసకొట్టే... పగడెత్తు పైటున్న ఆ చీరకట్టు
జిగినీల జాకెట్టు... సొగసైన లాకెట్టు
జిగినీల జాకెట్టు.. హో .. సొగసైన లాకెట్టు... విడిచి పెడితే పెట్టు... నా మీద ఒట్టు !
చరణం 2:
నీ కొంటె కవితకి... నీరాజనాలు
ఆ వాడి చూపుకు... అభివందనాలు
ఈ ఆపసోపాలకు... ఆ విరహ తాపాలకు...
ఈ ఆపసోపాలకు... ఆ విరహ తాపాలకు .. అందించనా నేను సుస్వాగతాలు !
నీ కొంటె కవితకి... నీరాజనాలు
ఆ వాడి చూపుకు... అభివందనాలు
చరణం 3:
నీ వలపే ...ఉసిగొలుపు... నా చెలిమే చేయి కలుపు
పొలిమేరలో పిలుపు... పులకింతలే రేపు...
జడలోని మల్లికలు...జవరాలి అల్లికలు
చలి పెంచే కోరికలు... జాబిలితో కలయికలు
ఈ ఆరుబయటా ...అందాల అల్లరులు
ఈ పూట నాలో పలికించే... కిన్నెరలు
కలిసిపోనా ఏరు నీరై... నేనింక నీవై .. నీవింక నేనై...
నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
pallavi:
nī kolagaḽḽagi nīrājanālu
ā vālu sūbugu abhivaṁdanālu
ī kobadābālagu...ā tībi śhābālagu
ī kobadābālagu ...ā tībi śhābālagu ..aṁdiṁchanā nīgu harisaṁdanālu !
nī kolagaḽḽagi nīrājanālu
ā vālu sūbugu abhivaṁdanālu
saraṇaṁ 1:
koḍerulāṁṭi ā kŏsa mukku... prŏddu niddara lesinaṭṭu ā bŏṭṭu
misamisalu pasigaṭṭi kasibaṭṭi busagŏṭṭe... pagaḍĕttu paiḍunna ā sīragaṭṭu
jiginīla jāgĕṭṭu... sŏgasaina lāgĕṭṭu
jiginīla jāgĕṭṭu.. ho .. sŏgasaina lāgĕṭṭu... viḍisi pĕḍide pĕṭṭu... nā mīda ŏṭṭu !
saraṇaṁ 2:
nī kŏṁṭĕ kavidagi... nīrājanālu
ā vāḍi sūbugu... abhivaṁdanālu
ī ābasobālagu... ā viraha tābālagu...
ī ābasobālagu... ā viraha tābālagu .. aṁdiṁchanā nenu susvāgadālu !
nī kŏṁṭĕ kavidagi... nīrājanālu
ā vāḍi sūbugu... abhivaṁdanālu
saraṇaṁ 3:
nī valabe ...usigŏlubu... nā sĕlime seyi kalubu
pŏlimeralo pilubu... pulagiṁtale rebu...
jaḍaloni malligalu...javarāli alligalu
sali pĕṁche korigalu... jābilido kalayigalu
ī ārubayaḍā ...aṁdāla allarulu
ī pūḍa nālo paligiṁche... kinnĕralu
kalisibonā eru nīrai... neniṁka nīvai .. nīviṁka nenai...
nī kolagaḽḽagi nīrājanālu
ā vālu sūbugu abhivaṁdanālu