నీ కెంత పరాకైనా నెలఁత మరవలేదు
(॥పల్లవి॥)
నీ కెంత పరాకైనా నెలఁత మరవలేదు
చేకొన్న నీమీఁది బత్తి చిగిరించుఁ గాక
(॥॥)
వేడుకగలవారలు వేసర రెంతైనాను
చూడఁ జూడ వలపులు జొబ్బిలుఁ గాని
వాడికైనపొందులు వదల వెన్నటికిని
యీడు జోడై మీఁదమీఁద హెచ్చుఁ గాని
(॥॥)
యెనసివుండినవారు యెగ్గుపట్ట రేమిటికి
వెనుకొన్న ముచ్చటలు వెలయుఁ గాని
మనసువచ్చినచోట మానవు తీరతీవులు
వినయపుఁ బ్రియములు వెగ(గ్గ)ళించుఁ గాని
(॥॥)
సమ్మతించినవారు జడియ రేపనికిని
పుమ్మగిలుకాఁగిళ్లు వొద్దికౌఁ గాని
యిమ్ముల శ్రీవేంకటేశ ఇంతి నిట్టె కూడితివి
చిమ్ముసరసము లింకాఁ జెలరేఁగుఁ గాని
(||pallavi||)
nī kĕṁta parāgainā nĕlam̐ta maravaledu
segŏnna nīmīm̐di batti sigiriṁchum̐ gāga
(||||)
veḍugagalavāralu vesara rĕṁtainānu
sūḍam̐ jūḍa valabulu jŏbbilum̐ gāni
vāḍigainabŏṁdulu vadala vĕnnaḍigini
yīḍu joḍai mīm̐damīm̐da hĕchchum̐ gāni
(||||)
yĕnasivuṁḍinavāru yĕggubaṭṭa remiḍigi
vĕnugŏnna muchchaḍalu vĕlayum̐ gāni
manasuvachchinasoḍa mānavu tīradīvulu
vinayabum̐ briyamulu vĕga(gga)ḽiṁchum̐ gāni
(||||)
sammadiṁchinavāru jaḍiya rebanigini
pummagilugām̐giḽlu vŏddigaum̐ gāni
yimmula śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ kūḍidivi
simmusarasamu liṁkām̐ jĕlarem̐gum̐ gāni