Nee kalladodi naa kallalogi soostene samda&

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద&
Work
Year
Language

పల్లవి:

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

చరణం 1:

అడుగునవుతాను నీ వెంట నేను తోడు గా నడవగా చివరి దాకా
గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా..

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం

చరణం 2:

వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరవుతాను నీ లోన నేను ఎన్నడు నీ జతే వదల కుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదురు పైనా వస్తాను చిరుగాలి లా....

pallavi:

nī kaḽḽadoḍi nā kaḽḽalogi sūstene saṁdrodayaṁ
nī sūbudoḍi nanu tāguduṁṭe tanuvaṁta sūryodayaṁ
ilāge ilāge manaṁ egamayye kṣhaṇāle kadā o varaṁ
alāge alāge prabaṁchālu palige kadhavvāli manamiddaraṁ

nī kaḽḽadoḍi nā kaḽḽalogi sūstene saṁdrodayaṁ
nī sūbudoḍi nanu tāguduṁṭe tanuvaṁta sūryodayaṁ

saraṇaṁ 1:

aḍugunavudānu nī vĕṁṭa nenu toḍu gā naḍavagā sivari dāgā
gŏḍugunavudānu igabaina nenu vānalo ninnīlā taḍavanīga
ninnŏdili kṣhaṇamaina asaluṁḍalenu sirunavvunavudānu pĕdavaṁchunā
nī leda sĕkkiḽḽa vāgīḽḽalone tŏli siggu nenavvanā..

nī kaḽḽadoḍi nā kaḽḽalogi sūstene saṁdrodayaṁ
nī sūbudoḍi nanu tāguduṁṭe tanuvaṁta sūryodayaṁ

saraṇaṁ 2:

vĕnnĕlavudānu pradi reyi nenu sīgaḍe nī darigi seraguṁḍā
ūbiravudānu nī lona nenu ĕnnaḍu nī jade vadala kuṁḍā
nā rāṇi pādālu muddāḍuguṁṭū nenuṁḍibodānu pārāṇilā
siru sĕmaḍa paḍuduṁṭe nī nuduru painā vastānu sirugāli lā....