నీ కతఁడు మేలువాఁడు నీవూ మేలుదానవు
(॥పల్లవి॥)
నీ కతఁడు మేలువాఁడు నీవూ మేలుదానవు
జోకతో వొద్దఁగూచుండీఁ జోటియ్యఁగదవే
(॥నీక॥)
వాడికవలపులకు వాసు లెంచుకొనేల
వేడుకచెనకులకు వేసరనేల
జోడువాయకున్నందుకు సోంటులు సోదించనేల
వీడెమిచ్చీ నందుకో చెలి విభుఁడు నీకు
(॥నీక॥)
తారుకాణలైనమీఁద తలవంచుకొననేల
కూనిమిగలుగుచోటఁ గొసరనేల
చేరి వేఁడుకొనేవేళ సిగ్గులువడఁగనేల
పేరుకొనీ నూఁకోనవే ప్రియుఁడు నిన్ను
(॥నీక॥)
మెలములు సలుపఁగా మించి వొడ్డించుకొనేల
కాలుదొక్కి పెండ్లాడఁ గడమలేల
ఆలవు తోల్లేనీవు అలమేల్‌మంగవు నిన్నుః
నేలె మొక్కవే శ్రీవేంకటేశుఁడు నేఁడు
(||pallavi||)
nī kadam̐ḍu meluvām̐ḍu nīvū meludānavu
jogado vŏddam̐gūsuṁḍīm̐ joḍiyyam̐gadave
(||nīga||)
vāḍigavalabulagu vāsu lĕṁchugŏnela
veḍugasĕnagulagu vesaranela
joḍuvāyagunnaṁdugu soṁṭulu sodiṁchanela
vīḍĕmichchī naṁdugo sĕli vibhum̐ḍu nīgu
(||nīga||)
tārugāṇalainamīm̐da talavaṁchugŏnanela
kūnimigalugusoḍam̐ gŏsaranela
seri vem̐ḍugŏneveḽa sigguluvaḍam̐ganela
perugŏnī nūm̐konave priyum̐ḍu ninnu
(||nīga||)
mĕlamulu salubam̐gā miṁchi vŏḍḍiṁchugŏnela
kāludŏkki pĕṁḍlāḍam̐ gaḍamalela
ālavu tollenīvu alamelmaṁgavu ninnuḥ
nelĕ mŏkkave śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu