నీ జిలుగు పైటనీడలోన నిలువని
పల్లవి:
నీ నడుముపైన చేయి వేసి నడువని
నన్ను నడువని
నీ చేతుల చెరసాలలోన.. చేరని
నన్ను చేరని
నీ జిలుగుపైట నీడలోన నిలువని
నన్ను నిలువని
నీ అడుగులోన అడుగువేసి నడువని
నన్ను నడువని
చరణం 1:
చిక్కని బుగ్గలపై చిటికెలు వేయని
సన్నని నవ్వులలో సంపెంగలేరని
గులాబి పెదవులనే.. అలా అలా చూడని
నీ జిలుగుపైట నీడలోన నిలువని
నన్ను నిలువని
నీ అడుగులోన అడుగులేసి నడువని
నన్ను నడువని
చరణం 2:
పచ్చిగ తిన్నెలలో వెచ్చగ సాగని
వెచ్చని వెన్నెలలో ముచ్చటలాడని
ముచ్చటలాడి ఆడి మురిసి మురిసి పాడని
నీ జిలుగుపైట నీడలోన నిలువని
నన్ను నిలువని
నీ అడుగులోన అడుగు వేసి నడువని
నన్ను నడువని
చరణం 3:
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
ఆ...ఆ...ఆ...ఆ..ఆ...
మబ్బుల వాడలో మనసులు కూడని
మల్లెల మేడలో మమతలు పండని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయని
బంగారు కోవెలలో కొంగులు ముడివేయని
pallavi:
nī naḍumubaina seyi vesi naḍuvani
nannu naḍuvani
nī sedula sĕrasālalona.. serani
nannu serani
nī jilugubaiḍa nīḍalona niluvani
nannu niluvani
nī aḍugulona aḍuguvesi naḍuvani
nannu naḍuvani
saraṇaṁ 1:
sikkani buggalabai siḍigĕlu veyani
sannani navvulalo saṁpĕṁgalerani
gulābi pĕdavulane.. alā alā sūḍani
nī jilugubaiḍa nīḍalona niluvani
nannu niluvani
nī aḍugulona aḍugulesi naḍuvani
nannu naḍuvani
saraṇaṁ 2:
pachchiga tinnĕlalo vĕchchaga sāgani
vĕchchani vĕnnĕlalo muchchaḍalāḍani
muchchaḍalāḍi āḍi murisi murisi pāḍani
nī jilugubaiḍa nīḍalona niluvani
nannu niluvani
nī aḍugulona aḍugu vesi naḍuvani
nannu naḍuvani
saraṇaṁ 3:
mabbula vāḍalo manasulu kūḍani
mallĕla meḍalo mamadalu paṁḍani
ā...ā...ā...ā..ā...
mabbula vāḍalo manasulu kūḍani
mallĕla meḍalo mamadalu paṁḍani
baṁgāru kovĕlalo kŏṁgulu muḍiveyani
baṁgāru kovĕlalo kŏṁgulu muḍiveyani