Nee jada kuchchulu

నీ జడ కుచ్చులు
Work
Year
Language

పల్లవి:

మ్మ్..మ్మ్..
ఆ..ఆ..ఆ
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్
అబ్బా!
ఆ..ఆ..ఆ..ఆ
సరే!

గురుర్బ్రహ్మ గురుర్విష్ణూ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

(నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక) ||2||

చరణం 1:

అడిగింది కన్నెయీడు శెలవింక, నిన్నే శెలవింకా
ఇచ్చే కౌగిళ్ళల్లోనే తమకి నెలవింక, ఇస్తా నెలవంకా
ఆపాలి అబ్బాయిగారు చొరవింక, చిలిపి చొరవింకా
పచ్చ పచ్చని కాపురాలే మనవింక, వింటే మనవింకా

అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక ||2||
పరువపు తెరవడి చలి చలి అలజడి చాలింకా

ఓ..నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక

చరణం 2:

నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక
నా వెనుక నీ నడక నాకెందుకులే కినుక
ఓ.. ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక

తననం తననం తననం తననం తనన దంద తన దం దం దం దం తందా..
తననం తననం తననం తననం తనన తంద దం దా నా నా నా...
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్..
గూడ్!
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్?
యేవైందండీ?
ఆహా!
పపదని పపపప దని మమ పద మమమమ పద
లా ల లా ల లా ల లా ల

చరణం 3:

మనసైన మరునాడే త్వరపడక, నువ్వు జొర పడక
పొద్దు వాలేటి వేళల్లోన చొరపడకా, కొంగు ముడి పడక
ఆపాలి అమ్మయిగారు గొడవింకా, మతులే పడవింకా
నీవు నేనైన రేవు చేరే పడవింకా, సాగే గుడివంక

బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక ||2||
మనసుకు మమతకు మనువులు జరిగితే చాలింకా

ఓ..ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక

నీ జడ కుచ్చులు..

pallavi:

mm..mm..
ā..ā..ā
mm..mm..mm..mm
abbā!
ā..ā..ā..ā
sare!

gururbrahma gururviṣhṇū gururdevo maheśhvaraḥ
gurussākṣhāt parabrahma tasmai śhrī gurave namaḥ

(nī jaḍaguchchulu nā mĕḍaguchchulu kanuga
nī vĕnuga nā naḍaga nī kĕṁdugule kinuga
o..navami siluga nagavu siluga tagadu aluga tagavu paḍaga) ||2||

saraṇaṁ 1:

aḍigiṁdi kannĕyīḍu śhĕlaviṁka, ninne śhĕlaviṁkā
ichche kaugiḽḽallone tamagi nĕlaviṁka, istā nĕlavaṁkā
ābāli abbāyigāru sŏraviṁka, silibi sŏraviṁkā
pachcha pachchani kāburāle manaviṁka, viṁṭe manaviṁkā

alagaga tŏlagaga nanu viḍi kadalaga
managiga kaladiga maruvaga kalayiga ||2||
paruvabu tĕravaḍi sali sali alajaḍi sāliṁkā

o..navami siluga nagavu siluga tagadu aluga tagavu paḍaga

saraṇaṁ 2:

nī sirunavvulu nā siga puvvulu kanuga
nā vĕnuga nī naḍaga nāgĕṁdugule kinuga
o.. uligi paḍaga kaligi paluga kalada paḍaga kalada paḍaga

tananaṁ tananaṁ tananaṁ tananaṁ tanana daṁda tana daṁ daṁ daṁ daṁ taṁdā..
tananaṁ tananaṁ tananaṁ tananaṁ tanana taṁda daṁ dā nā nā nā...
hmm..hmm..hmm..hm..
gūḍ!
hmm..hmm..hmm?
yevaiṁdaṁḍī?
āhā!
pabadani pabapaba dani mama pada mamamama pada
lā la lā la lā la lā la

saraṇaṁ 3:

manasaina marunāḍe tvarabaḍaga, nuvvu jŏra paḍaga
pŏddu vāleḍi veḽallona sŏrabaḍagā, kŏṁgu muḍi paḍaga
ābāli ammayigāru gŏḍaviṁkā, madule paḍaviṁkā
nīvu nenaina revu sere paḍaviṁkā, sāge guḍivaṁka

buḍi buḍi sūbula buggalu gichchaga
pŏḍi pŏḍi māḍala pŏddulu puchchaga ||2||
manasugu mamadagu manuvulu jarigide sāliṁkā

o..uligi paḍaga kaligi paluga kalada paḍaga kalada paḍaga

nī jaḍa kuchchulu..