Nee guname aadani niluvellaanu

నీ గుణమే ఆతని నిలువెల్లాను
Language

(॥పల్లవి॥)
నీ గుణమే ఆతని నిలువెల్లాను
చేగదేరెఁ బనులెల్లా చిత్తగించు మిఁకను

(॥నీగు॥)
కాటుకకన్నులతోడికలికి నీ చూపులు
నాటఁగా నాతనిమేను నల్లనాయను
తేటలనీ యధరపుతేనె లిచ్చినయందుకు
యీటులేకాతనిమోవి యెఱ్ఱనాయను

(॥నీగు॥)
చేరి నీవు నవ్వఁగాను చెమట ముత్తేలు రేఁగి
తేరి యాతనిభావము తెల్లనాయను
వూరట నీమేని పస పొరయఁగా నాతని
గారవపుఁబచ్చడము కడుఁ బసిమాయను

(॥నీగు॥)
కోకొమ్మని నీవు నీకొప్పుదవన మాతని
కాకడ ముడువఁగా నంటి పచ్చాయ
యీకడ వేంకటేశు కీమంజిష్టి నీ పయ్యద
పైకొని కప్పి కూడఁగా పంచవన్నె నాయను

(||pallavi||)
nī guṇame ādani niluvĕllānu
segaderĕm̐ banulĕllā sittagiṁchu mim̐kanu

(||nīgu||)
kāḍugagannuladoḍigaligi nī sūbulu
nāḍam̐gā nādanimenu nallanāyanu
teḍalanī yadharabudenĕ lichchinayaṁdugu
yīḍulegādanimovi yĕṭranāyanu

(||nīgu||)
seri nīvu navvam̐gānu sĕmaḍa muttelu rem̐gi
teri yādanibhāvamu tĕllanāyanu
vūraḍa nīmeni pasa pŏrayam̐gā nādani
gāravabum̐bachchaḍamu kaḍum̐ basimāyanu

(||nīgu||)
kogŏmmani nīvu nīgŏppudavana mādani
kāgaḍa muḍuvam̐gā naṁṭi pachchāya
yīgaḍa veṁkaḍeśhu kīmaṁjiṣhṭi nī payyada
paigŏni kappi kūḍam̐gā paṁchavannĕ nāyanu