Nee gunaalellaa vimti ninna monnane

నీ గుణాలెల్లా వింటి నిన్న మొన్ననే
Language

(॥పల్లవి॥)
నీ గుణాలెల్లా వింటి నిన్న మొన్ననే
ఆగడా లేమిసేతువో అత్తింటి కోడలను

(॥నీగు॥)
చద్దికి వేడికి నాతో సరసమాడవచ్చేవు
వద్దు సుమ్మీ వోయి మావారే మందురో
వుద్దండీఁడవు నీవైతే వొంటి నున్నదాన నేను
అద్దో నీవేమి సేతువో అత్తింటి కోడలను

(॥నీగు॥)
నట్టింటిలోనికి వచ్చి నాతోను నవ్వేవు
చుట్టా లేమందురో నిన్నుఁ జూచుకొమ్మీ
పట్టెఁడేసి గుబ్బలదాన పాయపు వాఁడవు నీవు
అట్టె నన్నేమి సేతువో అత్తింటి కోడలను

(॥నీగు॥)
వావి చెప్పి పక్కఁ బండి వలచి కాఁగిలించేవు
యీవల విన్న కన్నవారేమందురో
శ్రీ వేంకటేశుఁడవు చిన్ని చక్కనిదాన
ఆవటిం చేమి సేతువో అత్తింటి కోడలను

(||pallavi||)
nī guṇālĕllā viṁṭi ninna mŏnnane
āgaḍā lemiseduvo attiṁṭi koḍalanu

(||nīgu||)
saddigi veḍigi nādo sarasamāḍavachchevu
vaddu summī voyi māvāre maṁduro
vuddaṁḍīm̐ḍavu nīvaide vŏṁṭi nunnadāna nenu
addo nīvemi seduvo attiṁṭi koḍalanu

(||nīgu||)
naṭṭiṁṭilonigi vachchi nādonu navvevu
suṭṭā lemaṁduro ninnum̐ jūsugŏmmī
paṭṭĕm̐ḍesi gubbaladāna pāyabu vām̐ḍavu nīvu
aṭṭĕ nannemi seduvo attiṁṭi koḍalanu

(||nīgu||)
vāvi sĕppi pakkam̐ baṁḍi valasi kām̐giliṁchevu
yīvala vinna kannavāremaṁduro
śhrī veṁkaḍeśhum̐ḍavu sinni sakkanidāna
āvaḍiṁ semi seduvo attiṁṭi koḍalanu