Nedu shreevaarigi memamte paraagaa

నేడు శ్రీవారికి మేమంటే పరాకా
Work
Year
Language

పల్లవి:

నేడు శ్రీవారికి మేమంటే పరాకా..ఆ..ఆ..
తగని బలే చిరాకా ...ఎందుకో తగని బలే చిరాకా..ఆ..ఆ..

నేడు శ్రీవారికి మేమంటే పరాకా

చరణం 1:

మొదలు మగవారు వేస్తారు వేషాలు...
పెళ్ళీకాగానే చేస్తారు మోసం...

ఆ..ఆ..ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే...
కోపతాపాలే రావండి పాపం ..

కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు

నేడు శ్రీమతికి మాతోటి వివాదం ...
తగువే...బలే వినోదం...ఎందుకో ...తగువే బలే వినోదం..ఊ..
నేడు శ్రీమతికి మాతోటి వివాదం...

చరణం 2:

వారి మనసైతే వస్తారు ఆడవారు...
చేర రమ్మంటే రానేరారు...

తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు..
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు

అలుక సరదా మీకు... అదే వేడుక మాకు
అలుక సరదా మీకు... అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే...

ప్రణయ కలహాల సరసాలే వినోదం ...
నిజమే... బలే వినోదం...ఆ...నిజమే... బలే వినోదం
.ఆ...నిజమే... బలే వినోదం....నిజమే... బలే వినోదం

pallavi:

neḍu śhrīvārigi memaṁṭe parāgā..ā..ā..
tagani bale sirāgā ...ĕṁdugo tagani bale sirāgā..ā..ā..

neḍu śhrīvārigi memaṁṭe parāgā

saraṇaṁ 1:

mŏdalu magavāru vestāru veṣhālu...
pĕḽḽīgāgāne sestāru mosaṁ...

ā..ā..āḍavāḽḽaṁṭe śhāṁta svarūbāle...
kobadābāle rāvaṁḍi pābaṁ ..

kori serina manasu... seda sikkina alusu
kori serina manasu... seda sikkina alusu
kŏsagu ĕḍabāḍu alavāḍu sestāru

neḍu śhrīmadigi mādoḍi vivādaṁ ...
taguve...bale vinodaṁ...ĕṁdugo ...taguve bale vinodaṁ..ū..
neḍu śhrīmadigi mādoḍi vivādaṁ...

saraṇaṁ 2:

vāri manasaide vastāru āḍavāru...
sera rammaṁṭe rānerāru...

tĕlusugunnāru strīla svabhāvālu..
tĕlisi tīrsāru muddu muribālu

aluga saradā mīgu... ade veḍuga māgu
aluga saradā mīgu... ade veḍuga māgu
kaḍagu muribiṁchi gĕlisedi mīrele...

praṇaya kalahāla sarasāle vinodaṁ ...
nijame... bale vinodaṁ...ā...nijame... bale vinodaṁ
.ā...nijame... bale vinodaṁ....nijame... bale vinodaṁ