(॥పల్లవి॥)
నే నెఱఁగనా వోరి నీ మహిమ
కాననా యిన్నిటాఁ బాలు కడుఁ దెల్లనౌట
(॥నేనె॥)
ఇంతలో నాతో నీవేడలేనిబీరాలు
కొంత గొంత వాఁడిసేసి కుమ్మరించేవు
యింతటివాఁడవు నీ విటుగాకుండితే భూమి-
నింతటాను ముంటికొన కింతవాడి గలదా
(॥నేనె॥)
కానీ కానిమ్మని కమ్మరఁగ్రమ్మర దూరి
పానిపట్టుక నన్నుఁ బగచాటేవు
యేనెలవున నీకు యింతిసత్తి లేకుండితే
మానిపై నిమ్మపండు మరియేల పులిపె
(॥నేనె॥)
నీవిట్టె నన్నుఁగూడి నివ్వెరగైన నా-
భావమిదేమని పలికేవు
శ్రీవేంకటేశ నీచేతే కాకుండితే
మోవితేనెకు గంటి మొదలఁ గలిగెనా
(||pallavi||)
ne nĕṟam̐ganā vori nī mahima
kānanā yinniḍām̐ bālu kaḍum̐ dĕllanauḍa
(||nenĕ||)
iṁtalo nādo nīveḍalenibīrālu
kŏṁta gŏṁta vām̐ḍisesi kummariṁchevu
yiṁtaḍivām̐ḍavu nī viḍugāguṁḍide bhūmi-
niṁtaḍānu muṁṭigŏna kiṁtavāḍi galadā
(||nenĕ||)
kānī kānimmani kammaram̐grammara dūri
pānibaṭṭuga nannum̐ bagasāḍevu
yenĕlavuna nīgu yiṁtisatti leguṁḍide
mānibai nimmabaṁḍu mariyela pulibĕ
(||nenĕ||)
nīviṭṭĕ nannum̐gūḍi nivvĕragaina nā-
bhāvamidemani paligevu
śhrīveṁkaḍeśha nīsede kāguṁḍide
movidenĕgu gaṁṭi mŏdalam̐ galigĕnā