Ne neppudu nunnadaana neebaalididaananu

నే నెప్పుడు నున్నదాన నీపాలిటిదానను
Language

(॥పల్లవి॥)
నే నెప్పుడు నున్నదాన నీపాలిటిదానను
పూని మీఁదెత్తిని??? వలపులు చేకొనరాదా

(॥నేనె॥)
మొనగోర నిన్ను నూఁది మోహ మాకె పైఁ జల్లి
కనుసన్నలఁ బిలిచీఁ గందువలకు
ననునేల చెనకేవు నాతో నేమి నవ్వేవు
మనసుపెట్టి నాపెను మన్నించరాదా

(॥నేనె॥)
కెలసి సరసాలాడి కెలు గేలఁ గీలించి
సొలయుచుఁ బెనఁగీ నీసురతానకు
బలిమేల చేసేవు పట్టనేల నాచెరఁగు
కలయవచ్చినాపెను కాఁగిలించరాదా

(॥నేనె॥)
చిగురు మోవి చూపి సిగ్గులెల్లాఁ గూడపెట్టి
తగిలి చేయి చాచీ నీతములానకు
అగపడి శ్రీ వేంకటాధిప నన్నేలితివి
జిగి నేఁకరేయాపెను చేతనంటరాదా

(||pallavi||)
ne nĕppuḍu nunnadāna nībāliḍidānanu
pūni mīm̐dĕttini??? valabulu segŏnarādā

(||nenĕ||)
mŏnagora ninnu nūm̐di moha māgĕ paim̐ jalli
kanusannalam̐ bilisīm̐ gaṁduvalagu
nanunela sĕnagevu nādo nemi navvevu
manasubĕṭṭi nābĕnu manniṁcharādā

(||nenĕ||)
kĕlasi sarasālāḍi kĕlu gelam̐ gīliṁchi
sŏlayusum̐ bĕnam̐gī nīsuradānagu
balimela sesevu paṭṭanela nāsĕram̐gu
kalayavachchinābĕnu kām̐giliṁcharādā

(||nenĕ||)
siguru movi sūbi siggulĕllām̐ gūḍabĕṭṭi
tagili seyi sāsī nīdamulānagu
agabaḍi śhrī veṁkaḍādhiba nannelidivi
jigi nem̐kareyābĕnu sedanaṁṭarādā