నే నెప్పుడు నెఱుఁగుదు నీ గుణాలు
(॥పల్లవి॥)
నే నెప్పుడు నెఱుఁగుదు నీ గుణాలు
కానీలే పనులకు తార్కాణలు గావలదా
(॥నేనె॥)
చేకొని చెమటలెల్లా చెక్కులనే కారఁగాను
ఆకెకు మోహించనంటా నానవెట్టేవు
నీకు నీబొంకులెల్లాను విజమువలె నుండితే
వాకునఁ జూచినయట్టివారు మెచ్చవలదా
(॥నేనె॥)
ముంచిన నిట్టూర్పులు ముక్కు కొన నుండఁగాను
అంచె నాకెఁ గూడనంటా నానవెట్టేవు
యెఁచఁగ నీకపటాలు యియ్యకోలు నీకైతే
పొంచి పొరుగువారెల్లా పొగడఁగవలదా
(॥నేనె॥)
పోసరించి మేనిమీఁద పులకలు నిండుండఁగా
ఆసపడ నాకెకంటా నానవెట్టేవు
రాసికెక్క శ్రీవేంకటరమణ నన్నేలితివి
సేసవెట్టినాకె కివి పసెలవు గావలదా
(||pallavi||)
ne nĕppuḍu nĕṟum̐gudu nī guṇālu
kānīle panulagu tārgāṇalu gāvaladā
(||nenĕ||)
segŏni sĕmaḍalĕllā sĕkkulane kāram̐gānu
āgĕgu mohiṁchanaṁṭā nānavĕṭṭevu
nīgu nībŏṁkulĕllānu vijamuvalĕ nuṁḍide
vāgunam̐ jūsinayaṭṭivāru mĕchchavaladā
(||nenĕ||)
muṁchina niṭṭūrbulu mukku kŏna nuṁḍam̐gānu
aṁchĕ nāgĕm̐ gūḍanaṁṭā nānavĕṭṭevu
yĕm̐sam̐ga nīgabaḍālu yiyyagolu nīgaide
pŏṁchi pŏruguvārĕllā pŏgaḍam̐gavaladā
(||nenĕ||)
posariṁchi menimīm̐da pulagalu niṁḍuṁḍam̐gā
āsabaḍa nāgĕgaṁṭā nānavĕṭṭevu
rāsigĕkka śhrīveṁkaḍaramaṇa nannelidivi
sesavĕṭṭināgĕ kivi pasĕlavu gāvaladā