Ne neegu vimtadaananaa neegela veṟabu

నే నీకు వింతదాననా నీకేల వెఱపు
Language

(॥పల్లవి॥)
నే నీకు వింతదాననా నీకేల వెఱపు
పూని యిచ్చకముసేసి పొదుగఁగరాదా

(॥నేనీ॥)
పడఁతి నీకు నింతబాఁతియైతేఁ జాలుఁగాక
తొడిఁబడ నీవొద్దికిఁ దోడితెచ్చేరా
అడరి యేమి చూచేవు అల్లార్చి యాపెదిక్కు
అడియాలమేమైనా నాడు నంపరాదా

(॥నేనీ॥)
వెలయ నీ కాపెమాట వేడుకైతేఁ జాలుఁగాక
పలుమారు నాడ నొడఁ బరపించేరా
పిలిచి పేరుకొనుచు ప్రియము లెంత చెప్పేవు
చెలరేఁగి వొక్కమాటే సేసవెట్టరాదా

(॥నేనీ॥)
సరి నాపెరతి నీకు చవులైతేఁ జాలుగాక
తొరలించి తెచ్చి నీ పొత్తునఁ బెట్టేరా
ఇరవై శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
అరసి యాకెచే విడె మందుకొనరాదా

(||pallavi||)
ne nīgu viṁtadānanā nīgela vĕṟabu
pūni yichchagamusesi pŏdugam̐garādā

(||nenī||)
paḍam̐ti nīgu niṁtabām̐tiyaidem̐ jālum̐gāga
tŏḍim̐baḍa nīvŏddigim̐ doḍidĕchcherā
aḍari yemi sūsevu allārsi yābĕdikku
aḍiyālamemainā nāḍu naṁparādā

(||nenī||)
vĕlaya nī kābĕmāḍa veḍugaidem̐ jālum̐gāga
palumāru nāḍa nŏḍam̐ barabiṁcherā
pilisi perugŏnusu priyamu lĕṁta sĕppevu
sĕlarem̐gi vŏkkamāḍe sesavĕṭṭarādā

(||nenī||)
sari nābĕradi nīgu savulaidem̐ jālugāga
tŏraliṁchi tĕchchi nī pŏttunam̐ bĕṭṭerā
iravai śhrīveṁkaḍeśha iḍu nannu nelidivi
arasi yāgĕse viḍĕ maṁdugŏnarādā